ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి సమయంలో దేశ రాజధానిగా ఢిల్లీ ఎంత మేరకు కరెక్ట్‌ కాదంటూ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Earth Quake In Delhi-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయి.నేపాల్‌ మరియు ఇండియా బోర్డర్‌ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

దాని ప్రభావం ఇండియా మరియు నేపాల్‌లో కూడా కనిపించిందని ప్రకటించారు.

రిక్టర్‌ స్కేల్‌పై 5.1 గా ఈ భూకంప తీవ్రతను గుర్తించారు.ఢిల్లీతో పాటు ఉత్తరఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఇంకా పలు ఉత్తర భారత దేశ ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఢిల్లీలో అధికంగా భూకంపం ఉందని గుర్తించారు.భూకంపం అంటూ వార్తలు వచ్చిన వెంటనే ఢిల్లీ వాసులు అంతా కూడా ఇంటి బయటకు వచ్చారు.గంటల తరబడి ఇంటి బయటే ఉన్నారు.ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఇంట్లోంచి బయటకు వచ్చేసి కొన్ని గంటల పాటు వీధుల్లో కూర్చున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube