భూమికి రెండో చందమామ.. ఎక్కడ ఉందో తెలుసా..?

మనలో ప్రతి ఒక్కరికీ భూ గ్రహానికి చంద్రుడు ఉన్నాడనే విషయం తెలుసు.రోజూ రాత్రివేళలో ఆకాశంలో కనిపించే చంద్రుడు కారుమబ్బుల్లాంటి చీకట్లలో సైతం తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తాడు.

 Earth Has Captured New Mini Moon, Earth, Moon, Mini Moon, Scientists, Internatio-TeluguStop.com

పౌర్ణమి రోజున గుండ్రంగా కనిపించే చంద్రుడు అమావాస్య రోజున మాత్రం కంటికి కనిపించడు.నిజానికి అమావాస్య రోజు కూడా చంద్రుడు మనకు కనిపిస్తాడు.

కానీ ఆరోజు చంద్రుడు బూడిద వర్ణంలో ఉండటం వల్ల మనం చందమామను చూడలేము.

భూమి చుట్టూ తిరిగే చంద్రునిపై కూడా భూకంపాలు వస్తాయని, చంద్రుడిపై కూడా చెత్త ఉంటుందని మనలో చాలామందికి తెలీదు.

నాసా చేసిన పరిశోధనల ద్వారా చంద్రుని గురించి ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.భూమిపై వాతావరణంతో పోలిస్తే చంద్రునిపై వాతావరణం భిన్నంగా ఉంటుంది.రాత్రి వేళ గడ్డ కట్టించే చల్లదనంతో ఉండే చంద్రుడు పగలు మాత్రం భగభగా మండిపోతూ ఉంటాడు.

చందమామపై మానవుడి పాదంతో అడుగులు వేస్తే ఆ అడుగులు చెదిరిపోవడానికి పది కోట్ల సంవత్సరాలు పడుతుంది.

ఇతర గ్రహాలకు చాలా చందమామలు ఉన్నా భూ గ్రహానికి మాత్రం ఒక చందమామే ఉన్నాడని ఇప్పటివరకు మనకు తెలుసు.అయితే శాస్త్రవేత్తలు మాత్రం రెండో చందమామ కూడా ఉన్నాడని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.2020cd3 పేరుతో పిలవబడే మినీ మూన్ ఒక గ్రహశకలమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఆస్ర్టనామికల్ యూనియన్ లోని మైనర్ ప్లానెట్ సెంటర్ ఈ మినీ మూన్ ను కనిపెట్టింది.

చంద్రుడు ఏ విధంగా తిరుగుతాడో ఈ మినీ మూన్ కూడా అదే విధంగా తిరుగుతుంది.గ్రహశకలం భూమి కక్షలోకి రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.2021 సంవత్సరం మే నెల వరకు ఈ మినీ మూన్ భూ కక్ష్యలో ఉండనుందని సమాచారం.ఈ మినీ మూన్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube