క్రికేట్ మ్యాచ్ చూస్తూ, రోజు డబ్బులు సంపాదించండి

ఇలా చూడగానే అలా ఓ ఏడాది గడిచిపోయినట్టుందిగా.మన హైదరబాద్ జట్టు “సన్ రైజర్స్ హైదరాబాద్” ఐపియల్ గెలిచింది గత సీజన్ లోనే కదా, ఇంతలోనే మళ్ళీ ఐపియల్ పండుగ తిరిగివచ్చేసింది.

 Earn Hundreds And Thousands With Every Cricket Match-TeluguStop.com

ఈ రెండు నెలలు క్రికేట్ ప్రేమికులకి వినోదమే వినోదం.హై స్కోరింగ్ మ్యాచ్‌లు, కళ్ళుచెదిరే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలు, చీర్ లీడర్లు, ఫాంటసి లీగ్ లు .అబ్బో, ఈ రెండు నెలలు ఇలా చూడగానే అలా గడిచిపోతాయి.సాయంత్రం అయ్యిందంటే చాలు అందరం టీవికి అతుక్కుపోవాల్సిందే.

మరి టీవికి ఊరికే వినోదం కోసం అతుక్కుపోవడం ఎందుకు? డబ్బులు కూడా సంపాదించే మార్గం చెబుతాం, ఐపియల్ ద్వారా వినోదాన్ని మాత్రమే కాదు, సంపాదన కూడా పొందండి.అదెలాగా అంటారా? బెట్టింగ్ మాత్రం కాదండోయ్.

మన దేశంలో బెట్టింగ్ చట్టారీత్య నేరం .కాని ఈ ఐపియల్ అయ్యే బెట్టింగ్ బిజినెస్ లో వేల కోట్లు చేతులు మారతాయి.మనకి అంత పెద్ద విషయాలు, ప్రభుత్వం యొక్క పర్మీషన్ లేని ఆటలు ఎందుకు కాని, సింపుల్ గా, లీగల్ గా, రోజుకి వందలు లేదా వేల రూపాయలు సంపాదించే ఉపాయం చెబుతాం వినండి.ఐపియల్ లో ఫ్యాంటసి లీగ్ ఆడే అలవాటు ఉందా? ఆ అలవాటు ఉంటే ఇది మీకు ఇంకా ఈజీ.

ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికేట్ మ్యాచ్‌లు, ఫుట్ బాల్ మ్యాచ్ ల మీద మీకు పట్టు ఉంటే చాలు.ఏ టీమ్ ఎలా అడుతుందో, ఎవరి బలాబలాలు ఏంటో ఐడియా ఉంటే చాలు.

డ్రీమ్ 11 అనే యాప్ డౌన్లోడ్ చేసుకోని, డ్రీమ్ 11 కి సెలెక్ట్ చేసి, పాయింట్స్ కొల్లగొట్టి, డబ్బులు సంపాదించవచ్చు.మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే … సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది అనుకోండి .రెండు టీమ్స్ ని కలిపి మీరు ఒక పదకొండు మంది ఆటగాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి.

అంటే డేవిడ్ వార్నర్, విరాట్ కొహ్లీ .ఇలా రెండు టీమ్స్ లోంచి కలిపి ఓ 11 మంది ఆటగాళ్ళను మీ టీమ్ లో పెట్టుకోవాలి.ఒక్కో ఆటగాడికి కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఖర్చవుతాయి .మీ చేతిలో 100 క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి.వాటిని మీ 11 మంది ఆటగాళ్ళపై ఖర్చుచేసి, జట్టుని తయారుచేసుకోవాలి .మీరు సెలెక్ట్ చేసుకున్న ఆటగాళ్ళు గనుక మ్యాచ్ లో పెర్ఫార్మ్ చేస్తే మీ క్రెడిట్స్ పెరుగుతాయి.క్రెడిట్స్ పెరిగినా కొద్దీ మీ అకౌంట్లో డబ్బులు పడతాయి.

వాటిని మీరు విత్ డ్రా చేసుకోవచ్చు.ఇలా ప్రతి మ్యాచ్ కి మీ ఆటగాళ్ళు ఆడిన తీరుని బట్టి మీరు క్రెడిట్స్ సంపాదించడం కాని నష్టపోవడం కాని జరుగుతుంది.మీకు ఆట మీద, ఆటగాళ్ళ మీద మంచి అవగాహన ఉంటే మాత్రం రోజుకి వందలు, వేలు సంపాదించుకోవచ్చు.

ఇదిగోండి యాప్ లింక్ :

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube