అమెరికాలో ఎర్లీ ఓటింగ్ ..ఎంతమంది ఓటు వేశారో తెలుసా..!!!

అమెరికాలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది.ఓట్లు వేయడానికి అమెరికా ప్రజలు సిద్దంగా ఉన్నారు.

 Early Voting Started In America Due To Corona Pandemic, America, Corona Pandemic-TeluguStop.com

కరోనా నేపధ్యంలో ప్రభుత్వం పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది.నవంబర్ 3 వ తేదీన పోలింగ్ జరనున్న నేపధ్యంలో ఆ సమయంలో పోలింగ్ వేయలేని వారికోసం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది.

అలాంటి వారి కోసం ఎర్లీ ఓటింగ్ అనే విధానాన్ని ప్రారంభించారు.ఈ విధానం ద్వారా ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదిలాఉంటే


ఎర్లీ ఓటింగ్ ఏర్పాటు చేయడంతో అమెరికాలోని హ్య్యంటన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఒరా స్మిత్ అనే 108 ఏళ్ళ వృద్దురాలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది.ఈ విషయాన్ని ఆమె భంధువు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

సుమారు వందేళ్ళ క్రితం పుట్టిన మా ఒరా స్మిత్ ఇప్పుడు కరోనాను కూడా లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకోవాడానికి వచ్చిందని తెలిపారు.


108 ఏళ్ళ మా ఆంటీ ఓటు వేయడానికి బయటకి వచ్చిందంటే మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు రండి అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ పిలుపునిచ్చాడు.

దాంతో ఆమె పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.లక్షలాది మంది ఆ పోస్ట్ లు షేర్ చేస్తూ కామెంట్స్ చేశారు.

ఈ ఘటనపై ఒబామా కూడా తన స్పందన తెలిపారు.ఒరా స్మిత్ అందరికి ప్రేరణగా నిలిచారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది.

అందరూ ఆమెని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.అయితే ఇప్పటి వరకూ ఎర్లీ ఓటింగ్ పద్ధతి ద్వారా 4 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube