ముందస్తు ఎన్నికలా? లేక మంత్రి వర్గ విస్తరణా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి..?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన నిర్ణయాలను ఎన్నడూ లేనంత సంకోచిస్తూ తీసుకుంటున్నారు.తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనే పాలిస్తూ వస్తున్నారు.

 Early Election Or Ministerial Expansion What Is The Kcr Plan Details, Kcr, Trs,-TeluguStop.com

ఈ ఏడేళ్ల కాలంలో ఆయన ఎన్నో మంచి పనులు చేశారని టీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు.మనం చూసినా కూడా తెలంగాణలో పరిస్థితులు అభివృద్ధి జరిగిన విధంగానే కనిపిస్తున్నాయి.

కానీ ఎందుకో ఈ మధ్య కేసీఆర్ మీద వ్యతిరేఖత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.

ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నించినా కూడా ఈ వ్యతిరేఖత తగ్గడం లేదనే వాదన వినిపిస్తోంది.

ప్రజల్లో వచ్చిన వ్యతిరేఖతను తగ్గించుకోవడం కోసం ఆయన శత విధాలా ప్రయత్నిస్తున్నారు.ఎన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారు.అయినా కానీ వ్యతిరేఖత మాత్రం పోవడం లేదట.కానీ ఈ వ్యతిరేఖతలోనూ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన వేసిన ప్లాన్ మామూలుగా లేదని అంతా అనుకుంటున్నారు.

అదే కనుక నిజమైతే మరోసారి కేసీఆర్ గద్దెనెక్కుతారా లేదా అని వేచి చూడాలి.

ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఆయన మంత్రి వర్గ విస్తరణ చేపడతారని అంతా భావించారు.కానీ అటువంటిది ఏమీ జరగడం లేదు.అలా కాకుండా అగస్టు చివరి వారం వరకు ఆయన అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెబుతున్నారు.

అదే చేసే ఉద్దేశంలో కేసీఆర్ గనుక ఉంటే ఆయన ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టరని చెబుతున్నారు.అంతే కాకుండా ఈ సారి ఎన్నికలకు ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీం సాయం కూడా తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ టీం అంటే రాజకీయాల్లో ఆరి తేరిన వారు.ఎవర్ని ఎలా మ్యానేజ్ చేయాలో పీకే టీంకు తెలిసినంత బాగా మరెవరకీ తెలియదేమో.

KCR Plan For Early Elections or Cabinet Expansion TRS Telangana

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube