గద్దను ఉడుము పట్టుడు పట్టుకున్న అక్టోపస్  

Eagle Caught In Water By Octopus-octopus,viral ,water,weird News

సాధారణంగా ఉడుము పట్టుడు అనే పదాన్ని ఎవరైనా వేరేవారిని గట్టిగా పట్టుకుని వదలనప్పుడు వాడతారు.ఇలాంటిదే ఓ గద్ద నీటిలో చేపల వేటకోసం ప్రయత్నించి అక్టోపస్ చేతులకు చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యింది.

Eagle Caught In Water By Octopus-octopus,viral ,water,weird News Telugu Viral News Eagle Caught In Water By Octopus-octopus Viral Water Weird News-Eagle Caught In Water By Octopus-Octopus Viral Videos Water Weird News

దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కెనెడాలోని వాంకోవర్ ఐలాండ్‌లో ఈ దృశ్యం కనిపించింది.

నీటిలో చేపల కోసం వేచి ఉన్న గద్దను ఓ అక్టోపస్‌ లటుక్కున పట్టేసింది.ఆ గద్ద తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.

అయినా ఆ అక్టోపస్ ఉడుం పట్టుడు పట్టడంతో గద్ద నిస్సహాయంగా ఉండిపోయింది.కాగా అటువైపు వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించాడు.

అక్టోపస్ తన తొండాలతో గద్దను గట్టిగా పట్టుకుంది.దీంతో ఆ వ్యక్తి అక్టోపస్ పట్టు నుండి గద్దను విడుదల చేశాడు.

చావును దగ్గర్నుండి చూసిన గద్ద బతికి బట్ట కట్టడంతో వెంటనే అది తుర్రుమని ఎగిరిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేస్తూ గద్దను కాపాడిన వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.రెండున్నర మిలియన్ల మంది ఈ వీడియోను చూశారంటే ఇది ఎంత వైరల్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

తాజా వార్తలు