పార్ల‌మెంట్‌‌లో నేత‌ల ప‌రుగులు.. దేన్ని చూసి అంటే...?

మనుషులమైన మనం భూమిపైన ఉన్న ప్రతీ ఒక్క వస్తువును గురించి తెలుసుకుంటాం.తెలుసుకుంటూనే ఉంటాం.

 Leaders In Parliament .. What Do You Mean By ...?, Rat, Parlament, Spain , Sapan-TeluguStop.com

గుడి, బడి, ఆఫీసు, పార్లమెంటు ఇతరాల గురించి అర్థం చేసుకుంటాం.అయితే, మూగజీవాలకు ఇవన్నీ సేమ్.

అవి ఎక్కడున్నా ఒకేలాగా ఉంటాయి.మనం గుడిలో ఉంటే ఒకలా, బడిలో ఉంటే మరోలా ఉంటాం.

కానీ, జంతువులకు అంతా ఒకటే.ఈ క్రమంలో మూగజీవియైన ఎలుక వల్ల పార్లమెంటులో నేతలు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్‌లో ఈ ఘటన జరిగింది.

ఆ దేశ పార్లమెంట్‌లో కీలక బిల్లుల విషయమై నిర్వహిస్తున్న ఓటింగ్ సమయంలో ఓ చిన్న ఎలుక హల్‌చల్ చేసింది.

ఎంపీలను పరుగులు పెట్టించింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండవుతుండటంతో పాటు తెగ వైరలవుతోంది.

వివరాల్లోకెళితే.దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన తీర్మానాలపై స్పీకర్ ఓటింగ్ ప్రక్రియను చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఓటింగ్ సంబంధించి స్పీకర్ మార్తా బోస్కట్ వివరిస్తున్నారు.ఇంతలో ఒక చిట్టి ఎలుక ఎంపీల ముందు ఉన్న టేబుల్‌పైకి ఎక్కింది.

Telugu Martha Bosket, Sapanish, Spain-Latest News - Telugu

దానిని చూసి స్పీకర్‌ షాక్ తిన్నారు.అంత .ఇక ఏమైందో అనుకుని మిగ‌తా స‌భ్యులూ అటు ఇటూ చూశారు.ఇంతలోనే టేబుల్ పై నుంచి మరో చోటుకు ఎలుక పరిగెత్తింది.

అది చూసి కొందరు ఎంపీలు పార్లమెంట్‌ బయటకు పరుగులు తీశారు.ఇక మరికొందరేమో చైర్స్ పైకి ఎక్కి నిలబడ్డారు.

ఆ సమయంలో అలర్ట్ అయిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది పార్లమెంటు లోనికి వచ్చారు.ఆ మూషికాన్ని దొరకబట్టారు.

ఈ ఘటన తర్వాత ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.ఎలుక వల్ల ఇంత భయపడ్డామా? అని చర్చించుకున్నారు.కొంత సమయం తర్వాత స్పీకర్ యాజ్ యూజ్యువల్‌గా కీలక తీర్మానాలపై ఓటింగ్ ప్రక్రియ కొనసాగించారు.కాగా, ఎలుక విషయమై పరుగులు తీసిన నేతలు అంటూ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరలవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube