ఏ రాశివారు ఏ శక్తులను కలిగి ఉంటారో తెలుసా?     2018-03-06   22:54:35  IST  Raghu V

ప్రతి రాశివారికి సొంత శక్తులు అనేవి ఉంటాయి. వీరిలో నిగూఢంగా దాగి ఉన్న శక్తులు బయటకు రావాలంటే కొన్ని లక్షణాలను అలవరచుకోవాలి. వ్యక్తిలో ఉండే లక్షణాలు కూడా రాశుల ప్రకారమే ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిలో రాశి ప్రకారం ఎలాంటి శక్తులు దాగి ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రాశివారు చాలా దూకుడుగా ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం,నిజాయితీ,ఆశావాదం,కష్టపడేతత్వం ఉండే సమయాలలో శక్తులు బయటపడతాయి.

వృషభ రాశి
ఈ రాశివారు జీవితాన్ని నిర్మించుకోవటానికే నిరంతరం శ్రమిస్తారు. వీరి స్థిరమైన స్వభావం,క్రమశిక్షణ, ప్రతిభ ఉండే సమయాలలో శక్తులు బయటపడతాయి.

మిధున రాశి
ఈ రాశి వారు చుట్టూ జరిగే విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవటం,మానసికంగా దృడంగా ఉండే సమయాలలో శక్తులు బయటపడతాయి.

కర్కాటక రాశి
ఈ రాశివారు ఇతరుల హృదయాలను,ఇంటిని బాగా నిర్వహిస్తారు. ఒంటరిగా ఉండటం,భయపడటం,ఎక్కడ ఉన్న ఇంటి వాతావరణాన్ని సృష్టించే సమయంలో శక్తులు బయటపడతాయి.

సింహ రాశి
ఈ రాశి వారు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సంతోషంగా,ఆనందంగా ఉండటం,నమ్మకంగా ఉండే సమయాలలో శక్తులు బయటపడతాయి.

కన్య రాశి
ఈ రాశివారు ఆధ్యాత్మిక భావనను, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉంటారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం,సేవా దృక్పధం కలిగి ఉండే సమయాలలో శక్తులు బయటపడతాయి.