ఫిఫా వరల్డ్ కప్ లో ఒక్కో జట్టు విలువ ఎంతో తెలిస్తే షాక్ , క్రికెటర్ల వేతనం కన్నా 100 రేట్లు ఎక్కువ  

Each Team Cost Of Fifa World Cup 2019 -

మన దేశం లో క్రికెట్ ని ఒక మతం గా చూస్తాం , మన జీవితాలలో క్రికెట్ ని కూడా ఒక భాగం చేసుకున్నాం , క్రికెట్ ఆటగాళ్ళని ఆరాదిస్తాం.భారతీయులు ఎక్కువగా అభిమానించే ఆడే ఆట క్రికెట్.

కానీ ప్రపంచం లో ఎక్కువ గా చూసేది ఫుట్ బాల్ ని.బ్రెజిల్ , జర్మనీ , ఇంకా కొన్ని యురోపియన్ దేశాలలో ఫుట్ బాల్ కి ఉన్న క్రేజ్ చెప్పాన్నక్కర్లే.ఫుట్ బాల్ ప్రపంచ కప్ అనగానే ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది.మన దేశం లో కూడా ఫుట్బాల్ ని ఎక్కువగా చూస్తారు.ఐపీఎల్ లో ఆటగాళ్ల పైన పెట్టె మొత్తాలను చూసి అమ్మో ఇంతనా అనుకుంటాం, కానీ ఫుట్ బాల్ లో ఒక్కో ఆటగాడి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుంది.ఈ నెల 14 నుండి రష్యా లో జరిగే సాకర్ సంగ్రామంలో 32 జట్లు పాల్గొంటున్నాయి.

ఫిఫా వరల్డ్ కప్ లో ఒక్కో జట్టు విలువ ఎంతో తెలిస్తే షాక్ , క్రికెటర్ల వేతనం కన్నా 100 రేట్లు ఎక్కువ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ జట్ల మార్కెట్ విలువ దాదాపు 81000 కోట్లు.అంటే ఇది దాదాపు కొన్ని రాష్ట్రాలకు కేటాయించే బడ్జెట్ కి సమానం.

ఫిఫా మస్కట్ – జబివికా

తోడేలు స్ఫూర్తి తో ఫిఫా మస్కట్ గా జబివికా ని రూపొందించారు.రష్యన్ భాషలో జబివికా అంటే ‘ఎప్పుడు స్కోర్ చేసేవాడు ‘ అని అర్థం.

జబివికా ని ఏకటరీనా బోచారోవ తయారు చేసాడు.ఈ మస్కట్ కోసం వెబ్సైట్ లో పోలింగ్ నిర్వహిస్తే 60 శాతం మంది జబివికా కి ఓటు వేశారు.

అయితే ఈ ప్రపంచ కప్ లో అందరి దృష్టి నలుగురి పైనే ఉంది వల్లే అర్జెంటీనా ఆటగాడు మెస్సి , బ్రెజిల్ యువ కెరటం నేయ్మార్ జూనియర్ , పోర్చుగల్ ఆటగాడు రోనాల్డో , ఈజిప్ట్ ఆటగాడు మో సాల , వీరే ప్రస్తుత ఫుట్బాల్ ఆటగాళ్లలో టాప్ లో ఉన్నారు , వేరే ఆటతీరు పైనే తమ తమ జట్లు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

సాకర్ ప్రపంచ కప్ లో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన ఐదు జట్లు (కోట్లలో)

ఫ్రాన్స్‌ 8572

(ఒక్కో ఆటగాడి సగటు- 372)

టాప్‌-3 ప్లేయర్లు

కలియన్‌ ఎమ్‌బాపె 951
గ్రిజ్‌మన్‌ 793
పాల్‌ పోగ్బా 713

స్పెయిన్‌ 8254

(ఒక్కో ఆటగాడి సగటు- 356)

టాప్‌-3 ప్లేయర్లు

సెర్గియో బాస్కెట్స్‌ 634
యిస్కో, అసెన్సియో 598
డి గియా, కొకే, నిగ్వేజ్‌ 558

బ్రెజిల్‌ 7548

(ఒక్కో ఆటగాడి సగటు – 328)

టాప్‌-3 ప్లేయర్లు
నేమార్‌ 1429
ఫిలిప్పె కౌంటినో 793
ఫిర్మినో, గాబ్రియెల్‌ జీసెస్‌ 637

జర్మనీ 7017

(ఒక్కో ఆటగాడి సగటు – 306)

టాప్‌-3 ప్లేయర్లు

టోనీ క్రూస్‌ 637
హుమెల్స్‌,ముల్లర్‌,స్టీగెన్‌, వెర్నెర్‌ 478
జోషువా కిమిచ్‌ 438

ఇంగ్లండ్‌ 6929

(ఒక్కో ఆటగాడి సగటు – 301)

టాప్‌-3 ప్లేయర్లు

హ్యారీ కేన్‌ 1190
డెలే అలీ 793
రహీమ్‌ స్టెర్లింగ్‌ 714

అత్యల్ప మార్కెట్‌ విలువ కలిగిన 3 జట్లు

1.పనామా – 74 కోట్లు
2.సౌదీ -148 కోట్లు
3.పెరూ -250 కోట్లు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు