జాగ్రత్త : ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే అది తప్పని సరిగా ఉండాలట...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.

 E Pass Permission, Andhra Pradesh State, Gagan Narang, Andhra Pradesh News, Loc-TeluguStop.com

ఇందులోభాగంగా ఇప్పటికే లాక్ డౌన్ పేరుతో జన వ్యవస్థను స్తంభింపజేస్తు, పలు సంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తూ ఇంటి నుంచి పని చేసే అవకాశం కూడా ఉద్యోగులకు కల్పిస్తున్నారు.అయితే ఈ మధ్య లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టడంతో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నారు.

అంతేగాక అనవసరంగా ఒక చోట నుంచి మరో చోటికి కూడా ప్రయాణాలు చేస్తున్నారు.దీంతో తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ పలు కీలక సూచనలు చేశారు.

ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి వారికి ఖచ్చితంగా ఈ పాస్ ఉండాలని తెలిపారు.లేదంటే రాష్ట్రంలోకి అనుమతించేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.అంతేగాక ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చేవారు చెక్ పోస్టులలో ఏర్పాటు చేసినటువంటి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కి కచ్చితంగా హాజరు కావాలని ఒకవేళ నిబంధనలను ఎవరైనా అతి క్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.

ఈ  విషయం ఇలా ఉండగా  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయినటువంటి కరోనా పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలిస్తే తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం.ఇందులో 187 మంది మృత్యువాత పడగా 6500 పైచిలుకు మంది విజయవంతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube