హ్యాకింగ్ కి గురైన 73 కోట్ల మంది ఈమెయిల్, పాస్వర్డ్స్ ! మీ ఈమెయిల్ సేఫ్ గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

మనమంతా ఇప్పుడు ఆన్లైన్ లోకంలో ఉన్నాం.ఏది కావాలన్నా మనకి క్షణాల్లో వచ్చి చేరుతుంది అంటే అదంతా ఆన్లైన్ పుణ్యమే.

 E Mail Addresses And Passwords Are Leaked3-TeluguStop.com

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అంతే స్థాయిలో హ్యాకర్లు విజృంభిస్తున్నారు.హ్యాకర్ల బారిన పడితే కోట్లాది రూపాయలు నష్టపోవడంతో పాటు చాలా విలువైన సీక్రెట్ గా ఉండాల్సిన సమాచారం కూడా బట్టబయలు అయిపోతుంది.

ఇప్పుడు ఈ విధంగానే… ఈమెయిల్ ఉపయోగించేవారందరికి దిమ్మతిరిగే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.అదేంటి అంటే… ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల మంది వినియోగదారులకు సంబంధించిన కీలకమైన ఈ మెయిల్ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లు లీకైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

మొత్తం 87 GB భారీ పరిమాణం కలిగిన ఈ ఫైళ్లని ప్రముఖ ఫైలు షేరింగ్ నెట్ వర్క్ Megaలో హ్యాకర్లు అప్లోడ్ చేశారు.ప్రస్తుతం ఆ సంస్థ ఆ డేటా డంప్‌ని డిలీట్ చేసింది అనుకోండి.

ఇప్పటికే అనేక మంది వాటిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఈ ఫైళ్లకి సంబంధించిన స్క్రీన్షాట్ పైన గమనిస్తే, మన దేశానికి చెందిన vstudy.in వంటి కొన్ని వెబ్‌సైట్ నిర్వాహకుల ఈ-మెయిల్ అడ్రస్ లు కూడా లీక్ అయినట్లుగా మీరు స్పష్టంగా గమనించవచ్చు.

ఈ డేటా లీక్‌లో మీ ఈ-మెయిల్ అడ్రస్ కూడా కాంప్రమైస్ అయిందో లేదో ఛెక్ చేసుకోవాలంటే ఆలస్యం చేయకుండా Have I been pwned అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అందులో మీ మెయిల్ ఐడి టైప్ చేయండి.

ఈ వెబ్సైట్ ఇప్పటివరకు వివిధ డేటా లీక్‌లలో మీ మెయిల్ ఐడి ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్లయితే ఆ విషయం మీ దృష్టికి తీసుకు వస్తుంది.వెంటనే మీ పాస్వర్డ్ మార్చుకోండి.ఇటీవల కాలంలో వివిధ ఆన్లైన్ సర్వీసులకు సంబంధించిన డేటా థెప్ట్ జరుగుతున్న సందర్భంలో, ఒకవేళ సంబంధిత సర్వీసులు 2-స్టెప్ వెరిఫికేషన్ అందిస్తున్నట్లయితే సెక్యూరిటీ ఆప్షన్స్ లోకి వెళ్లి తప్పనిసరిగా దాన్ని ఎనేబుల్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube