వీరి ప్రేమ కధ వింటే మాత్రం నిజంగా గుండె బరువెక్కిపోతుంది  

Dying Man Marries His Love-cake And Flowers,dying Man,honey Moon,males Harrison,musicas Night

ప్రేమ కధల గురించి నిజజీవితంలో ఎలా ఉంటాయో గానీ చిత్రాల్లో మాత్రం గుండె ను బరువెక్కించేస్తాయి.కొన్ని కొన్ని కథలు వింటుంటే నిజంగా కన్నీళ్లు కూడా ఆగవు.అయితే ఇలాంటి ప్రేమ కథలు కేవలం సినిమాల్లోనే చూడగలం అని అనుకుంటున్న వారికి ఈ జంట ప్రేమ కథ వింటే మాత్రం గుండె బరువెక్కాల్సిందే.

Dying Man Marries His Love-cake And Flowers,dying Man,honey Moon,males Harrison,musicas Night-Dying Man Marries His Love-Cake And Flowers Dying Honey Moon Males Harrison Musicas Night

వీరి ప్రేమ గురించి తెలుసుకుంటే మాత్రం నిజంగా కన్నీళ్లు ఆగవు కూడా.ఇంగ్లాండ్ లోని ఫిల్లెగ్ గ్రామానికి చెందిన మేల్స్ హార్రిసన్ వ్యక్తి తన 18 ఏళ్ల వయసు నుంచి బ్రయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో ఇటీవల వైద్య పరీక్షల కోసం డాక్టర్ ను సంప్రదించగా అన్ని పరీక్షలు చేసిన తరువాత అతడు ఇక ఎక్కువ రోజులు బ్రతకడని వైద్యులు తేల్చి చెప్పేశారు.దీనితో మేల్స్ కుటుంబ సభ్యుల తో పాటు అప్పటికే మేల్స్ తో ప్రేమ లో ఉన్న అతడి ప్రియురాలు లిజ్ కూడా ఆందోళనకు గురైంది.

Dying Man Marries His Love-cake And Flowers,dying Man,honey Moon,males Harrison,musicas Night-Dying Man Marries His Love-Cake And Flowers Dying Honey Moon Males Harrison Musicas Night

అయితే మేల్స్ ను ఎంతో ప్రేమించిన లిజ్ మాత్రం చివరి క్షణాల్లో తన ప్రియుడిని సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకొని అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది.ఈ విషయాన్నీ నేరుగా మేల్స్ కే చెప్పడం తో మొదట ఒప్పుకోకపోయినా లిజ్ నచ్చ చెప్పడం తో చివరికి అంగీకరించాడు.దీనితో ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చి లిజ్ కి మేల్స్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు.

దీంతో ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోడానికి నిర్ణయించుకున్నారు.అయితే అప్పటికే మేల్స్ తన వైద్య ఖర్చుల వల్ల పెళ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కావడం కొంచం కష్టమవ్వడం తో అతడి బంధువులు,స్నేహితులు అందరూ కూడా వారికి సాయం చేశారు.

మరోపక్క మేల్స్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెడ్డింగ్ ప్లానర్ లూయిస్ హెడ్జెస్ కూడా వారి పెళ్లికి అవసరమైన వేదిక, కారు, ఫొటోగ్రాఫర్, కేక్, సంగీత కచేరీ, హనీమూన్ తదితరాలన్నీ ఉచితంగా సమకూర్చేందుకు ముందుకు రావడం తో అందరి సహకారం తో ఆ జంట పెళ్లి బంధం తో ఒక్కటయ్యింది.వీరి పెళ్లి కేవలం వీడియోలకే పరిమితం కాలేదు,పెళ్లి వార్త మీడియా లోనూ తెగ వార్తలుగా వచ్చాయి.

నిజంగా కన్ను మూసే కొద్దీ రోజుల ముందు ప్రియుడిని సంతోషంగా ఉంచాలి అని లిజ్ చేసిన త్యాగం గురించి తెలుసుకుంటే మాత్రం గుండె బరువెక్కిపోతుంది.అయితే మేల్స్, లిజ్ మాత్రం వారి పెళ్లి జరిగినందుకు తెగ సంబరపడిపోతున్నారు.

మేల్స్ అయితే లిజ్ ని పెళ్లి చేసుకోవడం నా కల.నిజంగా ఈ రోజు నా కల నెరవేరింది,ఇంతమంది మంచి మనుషులు కలిసి మా పెళ్లి జరిపించడం చాలా ఆనందంగా ఉందంటూ మేల్స్ సంబర పడిపోయాడు.

ఎక్కువ రోజులు బ్రతకవని డాక్టర్లు స్పష్టం చేసినా ఈ పెళ్లి ఆనందం ముందు మేల్స్ కు ఆ బాధ గుర్తుకురాకుండా పోయింది.నిజంగా చివరి రోజుల్లో అతడు తాను గాఢంగా ప్రేమించిన లిజ్ తో హ్యాపీ గా జీవితాన్ని గడుపుతాడేమో చూడాలి.