అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ డ్వేన్ జాన్సన్ సిద్ధం..?

పాపులర్ హాలీవుడ్ స్టార్, మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ డ్వేన్ జాన్సన్ (ది రాక్)( Dwayne ‘The Rock’ Johnson ) 2022లో యూఎస్ అధ్యక్ష పదవికి పోటీ చేయవలసిందిగా వివిధ రాజకీయ పార్టీలు కోరాయి.2021లో జరిగిన పోల్‌లో 46% మంది అమెరికన్లు అతని ప్రచారానికి మద్దతు ఇస్తారని తేలిన తర్వాత పోటీ చేయవలసిందిగా కోరడం జరిగింది.అయితే తాజాగా ఈ స్టార్ హీరో ట్రెవర్ నోహ్( Trevor Noah ) కొత్త స్పాటిఫై పోడ్‌కాస్ట్ ‘వాట్ నౌ?’లో దీని గురించి మాట్లాడాడు.

 Dwayne Johnson Says Parties Approached Him To Run For President Details, Dwayne-TeluguStop.com

పోల్ ఫలితాలు, పార్టీలు తన పట్ల ఆసక్తి చూపడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని జాన్సన్ అన్నారు.

పోటీ చేయాలని నిర్ణయించుకుంటే గెలిచే మంచి అవకాశం ఉందని వివిధ రాజకీయ పార్టీలు సొంత పరిశోధన చేశాయని కూడా అతను చెప్పాడు.అయితే, తనకు ఎప్పుడూ రాజకీయాల్లో చేరాలనే లక్ష్యం లేదని, దాని గురించి చాలా అసహ్యించుకుంటున్నానంటూ రాక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Telugu Centrist, Dwaynerock, Dwayne Johnson, Fatherhood, Joe Biden, Trevor Noah,

తనను తాను “సెంట్రిస్ట్”, “రాజకీయ స్వతంత్రుడు” అని పేర్కొన్నాడు.2020లో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌కు( President Joe Biden ) మద్దతిచ్చిన రాక్ గతంలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి తన ఆసక్తిని కూడా వ్యక్తం చేశాడు.2016లో GQ మ్యాగజైన్‌తో అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఒక ఆకట్టుకునే ఆలోచన అని చెప్పాడు.2017లో, అతను వెరైటీ మ్యాగజైన్‌తో 2024లో పోటీ చేయడానికి కన్సిడర్ చేస్తున్నట్లు తెలిపాడు.

Telugu Centrist, Dwaynerock, Dwayne Johnson, Fatherhood, Joe Biden, Trevor Noah,

యంగ్ రాక్( Young Rock ) అనే సిట్‌కామ్‌ ప్రోగ్రామ్ కూడా కొన్ని నెలల క్రితం ప్రసారం కావడం మొదలయ్యింది.అది అతను 2032లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడనే ఉద్దేశ్యంతో రూపొందించబడింది.ఫౌండింగ్ ఫాదర్స్‌కు తాను చాలా అసాధారణమైన అభ్యర్థినని, అయితే ప్రజలు తనను కోరుకుంటే వారికి సేవ చేయడం తాను సిద్ధమని కూడా రాక్( Rock ) వెల్లడించాడు.

కానీ 2022లో, అతను తన మనసు మార్చుకున్నట్లు అనిపించింది.

ముగ్గురు కుమార్తెల తండ్రిగా ఉండటంపై దృష్టి పెట్టాలనుకున్నందున అధ్యక్ష పదవికి పోటీ చేయడం కరెక్ట్ కాదని అతను చెప్పాడు.తన రెజ్లింగ్ కెరీర్( WWE ) కారణంగా తన పెద్ద కుమార్తె సిమోన్‌తో చాలా సమయాన్ని కోల్పోయానని, తన చిన్న కూతుర్లతో కూడా ఇలా టైమ్‌ గడపకుండా అధ్యక్ష పదవిలో చేరిపోతే తనకు సంతృప్తిగా అనిపించదని అన్నాడు.

పార్టీల ఆఫర్‌ను తిరస్కరించడానికి ప్రధాన కారణం ఇదేనని స్పష్టం చేశాడు.భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన లేదని అతను స్పష్టంగా కొట్టి పారేయలేదు.ప్రజలు కావాలనుకుంటే తాను అధ్యక్ష హోదా కోసం పోటీకి రెడీ అన్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube