ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కి 7.5 కోట్లు ఆర్జిస్తున్న హాలీవుడ్ స్టార్  

Dwayne Johnson Tops Instagram Rich List with Rs 7.66 Cr, Hollywood, Bollywood, social Media, Tollywood - Telugu Bollywood, Dwayne Johnson Tops Instagram Rich List With Rs 7.66 Cr, Hollywood, Social Media, Tollywood

ఒకప్పుడు సెలబ్రెటీలకి కేవలం సినిమా ద్వారానే ఆదాయం వచ్చేది.కోట్ల రెమ్యునరేషన్ సినిమాలలో నటించడం ద్వారా సంపాదించే వారు.

 Dwayne Johnson Instagram 7 66 Cr Hollywood

అయితే ఇప్పుడు వాళ్లకి కూడా ఆదాయమార్గాలు విస్తరించాయి.సెలబ్రిటీ ఇమేజ్ తో వారు చాలా రకాలుగా ఆదాయం సంపాదిస్తున్నారు.

అందులో ఎడ్వర్టైజ్మెంట్స్, అలాగే షాపింగ్ మాల్స్ ప్రారంభం, అలాగే ఏదైనా కార్పోరేట్ ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్ళడం ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారు.అయితే డిజిటల్ యుగం స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియా కూడా వారికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది.

ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కి 7.5 కోట్లు ఆర్జిస్తున్న హాలీవుడ్ స్టార్-Movie-Telugu Tollywood Photo Image

సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ ద్వారా అడ్వర్టైజ్ ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో కాస్ట్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది ఫలోవర్స్ ఉంటే ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది.

ఈ విషయంలో హాలీవుడ్ స్టార్, ఒకప్పటి డబ్యూడబ్యూఈ ఫైటర్ డ్వేన్ జాన్సన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు.ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ఇతను టాప్ లో ఉన్నారు.

సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం ఈ హాలీవుడ్ నటుడు అడ్వర్టైజ్ మెంట్ల కోసం చేసే ఇన్‌స్టాగ్రాం పోస్టు ఒక్కోటి దాదాపు 7కోట్ల 58 లక్షల 2 వేల 788 రూపాయలు వసూలు చేస్తున్నాడు.హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం.

జాన్సన్‌కు ఇన్‌స్టాగ్రాంలో 189 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఆ తర్వాత కైలీ జెన్నర్ కు 183 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

జెన్నర్ ప్రస్తుతం ఒక పోస్టుకు 986,000 డాలర్లు సంపాదిస్తూ రెండో స్థానంలో ఉంది.తర్వాత స్థానంలో ప్రో సాకర్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో, ఒక పోస్టుకు సుమారు 889,000 డాలర్లు వసూలు చేస్తూ మూడో స్థానంలో ఉన్నాడు.

జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియాన్ 858,000 డాలర్లు సంపాదిస్తూ నాలుగో స్థానంలో ఉన్నారు.

#Hollywood #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dwayne Johnson Instagram 7 66 Cr Hollywood Related Telugu News,Photos/Pics,Images..