నన్ను తప్పుగా చూస్తున్న ఆమెతోనే జీవితం అంటున్న ద్యుతిచంద్  

Dutee Chand faces family\'s wrath after revealing gender, Indian Sprinter, Sports, Gender Equality, Same Gender Relation - Telugu Dutee Chand Faces Family\\'s Wrath After Revealing Gender, Gender Equality, Indian Sprinter, Same Gender Relation, Sports

ఒకే జెండర్ రిలేషన్ షిప్, డేటింగ్, పెళ్లి అనేవి తప్పు కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ తీర్పు తర్వాత చాలా మంది తమ వ్యక్తిత్వం ఏంటి, తాము ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నాం అనే విషయాలు చెప్పడానికి ధైర్యంగా ముందుకి వస్తున్నారు.

 Dutee Chand Faces Familys Wrath After Revealing Gender

అలాగే కొంత మంది మరో అడుగు ముందుకి వేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు.గే రిలేషన్ లో ఉన్నవారు పెళ్లి చేసుకున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.

అయితే మగవాళ్ళు తమ జెండర్ ఎమోషన్ గురించి ధైర్యంగా బయటకి చెప్పినట్లు అమ్మాయిలు చెప్పడం లేదు.ఇప్పటికి సమాజం చిన్న చూపు చూస్తుందని తమ రిలేషన్ స్టేటస్ ని బయట పెట్టడం లేదు.

నన్ను తప్పుగా చూస్తున్న ఆమెతోనే జీవితం అంటున్న ద్యుతిచంద్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇండియన్ స్టార్ స్ప్రింటర్ ద్యుతిచాంద్ తన రిలేషన్ స్టేటస్ గురించి, తన వ్యక్తిత్వం గురించి ధైర్యంగా బయటకి చెప్పింది.తాను స్వలింగ సంపర్కురాలినని ప్రకటించుకుంది.అయితే అప్పటి నుంచి తమ గ్రామంతో పాటు చుటూ ఉన్న ప్రజలు తనను చిత్రంగా చూస్తున్నారని ద్యుతీ చంద్‌ చెప్పింది.అయినా తాను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది.

స్వలింగ సంపర్కురాలిగా కొనసాగడం గర్వంగా ఉందని, దీనికి కట్టుబడి ఉంటానని ప్రకటించింది.హైదరాబాద్‌లో అమెరికా కాన్సూల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌తో ఆన్‌లైన్‌లో ద్యుతి పలు అంశాలపై మాట్లాడింది.

తన గ్రామానికే చెందిన ఓ యువతితో జీవితాన్ని పంచుకోబోతున్నట్లు మరోసారి స్పష్టం చేసింది.ఎవరైనా ఏదో ఓ రోజు ప్రేమలో పడొచ్చు.

కులం, మతం, లింగాన్ని ఆధారంగా చేసుకొని ఎవరూ ప్రేమను నిర్ణయించలేరు.రహస్యాన్ని దాచిపెట్టడం కన్నా బయటపెట్టడమే ఉత్తమ మార్గం అనుకున్నా.

నా భాగస్వామి ప్రతిసారి నాకు మద్దతుగా నిలిచేది.అందుకే ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నాను అని చెప్పింది.

#Indian Sprinter #Sports #Gender Equality

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dutee Chand Faces Familys Wrath After Revealing Gender Related Telugu News,Photos/Pics,Images..