మిట్ట మధ్యాహ్నం కటిక చీకటి.. ఎక్కడ జరిగిందంటే!

సాధారణంగా ఎవరైనా మిట్టమధ్యాహ్నం చుక్కలు చూపిస్తా అంటూ సవాల్ చేస్తుంటారు.ఇలాంటి సవాళ్ల సంగతేమో కానీ మీరెప్పుడైనా పట్టపగలు చీకటి పడడం చూశారా.

 Dust Storm Turns Day Into Night In Us Upper Mid West Province Details, Afternoon-TeluguStop.com

ఎప్పుడైనా వర్షాకాలం కారు మబ్బులు కమ్ముకుంటే ఒక్కోసారి పగలే సాయంత్రం అయినట్లు అనిపిస్తుంది.సూర్యుడిని మబ్బులు చుట్టుముట్టడంతో పగలే రాత్రి అయిందా అనే తరహా అనుభూతిని కల్పిస్తుంది.

అయితే అంతకు మించి రాత్రి తరహాలో చీకట్లు పడడం చాలా అరుదుగా ఉంటుంది.ఇలాంటి తరహా ఘటనే అమెరికాలో ఇటీవల జరిగింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికాలోని అప్పర్ మిడ్ వెస్ట్ ప్రాంతంలో గురువారం అకస్మాత్తుగా కటిక చీకటి కమ్ముకుంది.

ఎంతంటే పక్కనే ఉన్న వాహనం కూడా కనిపించనంత అంధకారం అలముకుంది.అప్పటి వరకు మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎంతో వెలుతురు ఉండగా ఒక్కసారిగా చీకటి వచ్చేసింది.

రోడ్డుపై వెళ్తున్న వారు సైతం అవాక్కవడం వాళ్ల వంతైంది.కార్లు ఇతర వాహనాలలోని వారంతా ఒక్కసారిగా తమ వాహనాలను నిలిపి వేయాల్సి వచ్చింది.

ఒకవేళ ప్రయాణం ముందుకు సాగిద్దామంటే ఎదురుగా వచ్చే వాహనం కూడా కనిపించనంతగా చీకట్లు అలముకున్నాయి.చూస్తుండగానే దుమ్ము, ధూళితో కూడిన గాలి తుఫాను ఆ ప్రాంతాన్ని చుట్టేసింది.

Telugu Afternoon, America, Cyclone, Dust Storm, Storm, Turns Day, Usaupper, Late

ఆకాశంలో కనుచూపు మేర అదే దృశ్యం ఆవరించింది.దీంతో పగలు ప్రయాణాన్ని కూడా వాహనాల హెడ్ లైట్లను ఆన్ చేసి, తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది.ఈ రకమైన గాలి తుఫానును ‘డెరోకో’ అని పిలుస్తారు.ఈ తుఫానులో నీటి జల్లలు కూడా పడుతుంటాయి.ఒక్కోసారి గాలులు 80 నుంచి 100 కి.మీ.వేగంతో కూడా వీస్తుంటాయి.ఆ సమయంలో ఆరు బయట ఉంటే గాలికి కొట్టుకుపోయేంత బలంగా గాలులు వీస్తాయి.

ఇక ఈ డెరోకో వల్ల పట్టపగలే చీకట్లు అలముకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.నెటిజన్లు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube