విజయవాడ దుర్గ గుడి ఉద్యోగులపై దసరా స్పెషల్ ఆఫీసర్ సీరియస్ అయ్యారు.ప్రొటోకాల్ పరిధిలో లేనివారిని అంతరాలయంలోకి అనుమతిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.అయితే దుర్గగుడి వద్ద దర్శనాల నేపథ్యంలో పోలీస్ చెకింగ్ వంటి వ్యవహారాలలో రోజుకో వివాదం తలెత్తున్న విషయం తెలిసిందే.