ఎందుకు నీకు అంత పొగరు.. పాపం ఈ హీరోయిన్ ని అంతమాట అనేశారట!

దుషారా విజయన్‌ కథానాయికగా సార్పట్ట చిత్రం ద్వారా పరిచయమయ్యారు.ఈమె నటించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలయి మంచి ఆదరణ దక్కించుకుంది.

 Dushara Vijayan Reveals Aboout Sarpatta Movie Offer-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ చిత్రం విజయవంతమైన సందర్భంగా నటి దుషారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో ముచ్చటించారు.

నిజానికి నటి దిండుగల్‌ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందినది.ఫ్యాషన్ రంగంపై ఎంతో ఆసక్తి ఉండడంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది.ఈ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న సమయంలో ఈమెకు బోదై ఏరి బుద్ధిమారి అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించారు.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తనకు ఈ అద్భుతమైన అవకాశం వచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

 Dushara Vijayan Reveals Aboout Sarpatta Movie Offer-ఎందుకు నీకు అంత పొగరు.. పాపం ఈ హీరోయిన్ ని అంతమాట అనేశారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Dushara Vijayan, Paa Ranjith, Saarpatta Movie, Sarpatta Movie Actress Name, Telugu News Online, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఒకరోజు సార్పట్ట దర్శకుడు పా.రంజిత్‌ ఆఫీసు నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లి దర్శకుడిని కలవాల్సిందిగా చెప్పారు.ఈ క్రమంలోనే అది రాంగ్ కాల్ అయి ఉంటుందని భావించిన దుషారా మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లలేదు.ఈ క్రమంలోనే మరుసటి రోజు కూడా తనకు దర్శకుడు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తూనే నీకు అంత పొగరా? పా.రంజిత్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్ కాల్ వస్తే రాలేదు అంటూ ప్రశ్నించారు.ఈ విధంగా ఆమెను ప్రశ్నించడంతో ఒక్కసారిగా కంగుతిని ఇది నిజమైన ఫోన్ కాల్ అని భావించి వెంటనే హడావిడిగా అక్కడికి వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొనడంతో తనకు ఇంత అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా నటి మీడియా ముందు వెల్లడించారు.

#Paa Ranjith #SarpattaMovie #Dushara Vijayan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు