దసరా వేళ.. దుర్గమ్మ దర్శనానికి ఆన్ లైన్ టికెట్ తప్పనిసరి

దసరా వేళ.దుర్గమ్మ దర్శనానికి ఆన్ లైన్ టికెట్ తప్పనిసరి.

 During Dussehra Online Ticket Is Mandatory For Durgamma Darshan , Durgamma Darsh-TeluguStop.com

  దసరా రోజుల్లో విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్ళే భక్తులు విధిగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.కోవిడ్ దృష్ట్యా దర్శనానికి  వచ్చే ప్రతి ఒక్కరూ ముందస్తుగా ఆన్ లైన్ లో తమ పూర్తి వివరాలు నమోదు చేసి టికెట్ పొందాల్సి ఉంటుంది.ఇప్పటికీ భక్తులకు ఆన్ లైన్ ద్వారా  ధర్మ దర్శనం టికెట్ తో పాటు రూ.100, రూ.300 టికెట్ల విక్రయాలను ఆలయ అధికారులు ప్రారంభించారు. ధర్మ దర్శనం టికెట్ ను ఒక రూపాయిగా దేవస్థానం నిర్ణయించింది.

ఆన్ లైన్ లో aptemples.ap.gov.in వెబ్ సైట్ లో మీ వివరాలతో సేవ్ అప్ కావాలి.లాగిన్ ఐడి గా మీ ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని పెట్టుకోవచ్చు.తర్వాత మనకు నచ్చిన కోడ్ ను పాస్వర్డ్ గా పెట్టుకొని సైట్ లో లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత దేవ స్థానంలో పొందాల్సిన సేవలతో కూడిన 5 బాక్సులు కనిపిస్తాయి దీంట్లో దర్శనం అనే ఆప్షన్ ఎంచుకుని తర్వాత స్క్రీన్ లో కనిపించే బాక్స్ లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంచుకోవాలి.

ఈ నెలలో ఎన్ని టికెట్లు అందు బాటులో ఉన్నాయి అనే వివరాలతో కూడిన బాక్స్ కనిపిస్తుంది.అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాలు తేదీల్లో మనకు నచ్చిన తేదీ ని సెలెక్ట్ చేసుకోవాలి.

తేదీ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయా తేదీల్లో ఎన్ని టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో అన్న వివరాలతో పాటు టైం స్లాట్ కనిపిస్తుంది.ధర్మ దర్శనానికి రూ.1, బంగారు వాకిలి దర్శనం కి రూ.300, ముఖ మండప దర్శనం రూ.100.దర్శన టిక్కెట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయని వివరాలను తెలుసుకోవచ్చు.టిక్కెట్లు ఎన్ని కావాలి.ఏ సమయంలో కావాలి.అనే వివరాలను నమోదు చేసి కంటిన్యూ ఆప్షన్ ఎంచుకున్న అనంతరం భక్తులు ఆధార్ కార్డు ఇతర వివరాలను నమోదు చేయాలి.చెల్లించాల్సిన మొత్తాన్ని ఏ బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నమనే వివరాలను నమోదు చేయాలి.

బ్యాంక్ కార్డు వివరాలను నమోదు తోపాటు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత… టిక్కెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

During Dussehra Online Ticket Is Mandatory For Durgamma Darshan , Durgamma Darshan, Online Ticket, Dharma Darshan Ticket - Telugu Dharmadarshan, Dussehraticket, Ticket

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube