కష్ట సమయంలో నేపాల్ కి బిగ్ హెల్ప్ చేస్తున్న భారత్..!! 

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారీగా ఉందన్న సంగతి తెలిసిందే.రోజుకీ లక్షల్లో కొత్త కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తే ఉండటంతో ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

 During Corona Pandemic India Big Help To Nepal Country, India, Nepal, Corona Hel-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇండియా పక్క దేశం నేపాల్ లో కూడా మహమ్మారి భారీగా విజృంభిస్తోంది.దీంతో ఇప్పటికే అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆపేసిన నేపాల్ ప్రభుత్వం తాజాగా కరోనా కట్టడి కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది.

మరోపక్క కొత్త కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.దీంతో నేపాల్ దేశంలో కరోనా బారినపడిన రోగులు ఆక్సిజన్ కొరత తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి తరుణంలో కష్ట సమయంలో నేపాల్ కి బిగ్ హెల్ప్ చేయటానికి ఇండియా రెడీ అయింది.లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు పంపిస్తున్నట్లు ఆ దేశంలో ఉన్న భారత రాయబారి కార్యాలయానికి చెందిన అధికారులు నేపాల్ ప్రభుత్వం హామీ ఇచ్చారు.

పది రోజుల పాటు ఇండియా నుండి ఆక్సిజన్ సిలిండర్లు నేపాల్ కి వస్తాయని అదే రీతిలో గతంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు పంపించినట్లు గుర్తుచేశారు.  నేపాల్ దేశంలో రోజుకి 10 వేలకు పైగా కొత్త దేశంలో రావటంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో .అక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఇండియా ముందుకు రావడంతో నేపాల్ దేశానికి చెందిన అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube