షాక్...దుర్గమ్మ గుడి పాలక మండలి మొత్తం రాజీనామా  

Durgamma Temple Entire Board Members Resigned For Their Jobs-

విజయవాడ లోని కనకదుర్గ గుడి పాలక మండలి మొత్తం రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.ఒక్కరు కాదు,ఇద్దరు కాదు పాలకమండలి చైర్మన్,సభ్యులు మొత్తం అందరూ కూడా రాజీనామా చేయడం షాక్ కు గురి చేసింది.సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..

Durgamma Temple Entire Board Members Resigned For Their Jobs--Durgamma Temple Entire Board Members Resigned For Their Jobs-

మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో విజయాన్ని అందుకోవడం తో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది.అయితే ఈ ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ ఓడిపోవడంతోనే దుర్గగుడి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఏపీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలపై అధికార తెలుగు దేశం పార్టీ కి మింగుడు పడడం లేదు.దాదాపు ఏపీ మంత్రులు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం విశేషం.

ఆ పార్టీ చరిత్ర లో ఇంత ఘోర మైన ఓటమిని చవిచూడలేదు.దీనితో ఆ పార్టీ ఎక్కడ తప్పు జరిగింది అన్న కోణం లో విశ్లేషణ చేసుకుంటున్నాయి.తెలుగు దేశం పార్టీ ఓటమి కారణంగానే కనకదుర్గ గుడి పాలకమండలి ఈ రాజీనామా నిర్ణయం తీసుకుంది.

రాజీనామా చేసిన వారంతా కూడా తమ రాజీనామా లేఖలను ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.