మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే ఏమవుతుంది..?  

Duration Of Afternoon Sleep And Their Benefits-benefits Of Napping,better Mood,enhanced Performance,improved Alertness

Many people fall asleep in the afternoon. It is a good habit if it is in a manner. If the afternoon does not work, you can see for a while. But how long will you sleep, how many minutes do you get any benefits? * It is said that no more than an hour should not sleep. There are many reasons for it. One night's sleep is difficult. Otherwise, overdose may cause problems such as overweight and diabetes. If you sleep for the same hour, memory increases well. .
* A bell to sleep for refreshment is called. The brain also acts actively after an hour of sleep .. * Half the sleeping time will make the fatigue away. If the night is not sleeping, the workshop is in the middle, half an hour sleep is very useful.* Researchers say that twenty minutes of sleep can cause feeling energetic. This sleep in the office lunch break
* If it is working all day, it is better to sleep in the mid-term for ten minutes. Concentration can be damaged if you work alone. It is better to take ten minutes to break it.......

మధ్యాహ్నం నిద్రపోవడం చాలామందికి ఉండే అలవాటు. ఇది ఓ పద్ధతిలో ఉంటే చాలా మంచి అలవాటు కూడా. మధ్యాహ్నం పనులు లేకపోతే భేషుగ్గా కాసేపు కనుకు తీయవచ్చు...

మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే ఏమవుతుంది..?-Duration Of Afternoon Sleep And Their Benefits

అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా?

* మధ్యాహ్నం గంటన్నరకి ఎక్కువ పడుకోకూడదు అని అంటారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి రాత్రి నిద్రపట్టడం కష్టమైపోతుంది.

లేదంటే అతినిద్ర వలన అధికబరువు, డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అదే గంటన్నరపాటు నిద్రపోతే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

* రిఫ్రెష్ మెంట్ కోసం ఓ గంట నిద్ర చాలు అని అంటారు. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది గంటసేపు నిద్ర తరువాత.

* అరగంట నిద్ర అలసటను దూరం చేస్తుంది. రాత్రి నిద్రపట్టకపోతే, వర్క్ ప్రెషర్ మధ్యలో ఉంటే, అరగంట నిద్ర బాగా ఉపయోగకరం...

* ఇరవై నిమిషాల నిద్ర ఎనెర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతారు.

ఆఫీసు లంచ్ బ్రేక్ లో ఈ నిద్ర పనికివస్తుంది.

* రోజంతా పని ఉంటే, మధ్యమధ్యలో పదినిమిషాలు నిద్రపోవడం చాలా మంచిది. ఏకధాటిగా పనిచేస్తే ఏకాగ్రత దెబ్బతినవచ్చు. అలాంటప్పడు ఇలా బ్రేక్స్ ఇస్తూ పది నిమిషాల కునుకు తీయడం మంచిది.