మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే ఏమవుతుంది..?

మధ్యాహ్నం నిద్రపోవడం చాలామందికి ఉండే అలవాటు.ఇది ఓ పద్ధతిలో ఉంటే చాలా మంచి అలవాటు కూడా.

 Duration Of Afternoon Sleep And Their Benefits , Sleep, Work Pressure, Feel Ene-TeluguStop.com

మధ్యాహ్నం పనులు లేకపోతే భేషుగ్గా కాసేపు కనుకు తీయవచ్చు.అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా?.

* మధ్యాహ్నం గంటన్నరకి ఎక్కువ పడుకోకూడదు అని అంటారు.దానికి కారణాలు చాలానే ఉన్నాయి.ఒకటి రాత్రి నిద్రపట్టడం కష్టమైపోతుంది.లేదంటే అతినిద్ర వలన అధికబరువు, డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి.అదే గంటన్నరపాటు నిద్రపోతే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

* రిఫ్రెష్ మెంట్ కోసం ఓ గంట నిద్ర చాలు అని అంటారు. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది గంటసేపు నిద్ర తరువాత.

* అరగంట నిద్ర అలసటను దూరం చేస్తుంది.

రాత్రి నిద్రపట్టకపోతే, వర్క్ ప్రెషర్ మధ్యలో ఉంటే, అరగంట నిద్ర బాగా ఉపయోగకరం.

* ఇరవై నిమిషాల నిద్ర ఎనెర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతారు.

ఆఫీసు లంచ్ బ్రేక్ లో ఈ నిద్ర పనికివస్తుంది.

* రోజంతా పని ఉంటే, మధ్యమధ్యలో పదినిమిషాలు నిద్రపోవడం చాలా మంచిది.

ఏకధాటిగా పనిచేస్తే ఏకాగ్రత దెబ్బతినవచ్చు.అలాంటప్పడు ఇలా బ్రేక్స్ ఇస్తూ పది నిమిషాల కునుకు తీయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube