వైర‌ల్ పిక్‌.. అచ్చం ఒరిజిన‌ల్ పాల ప్యాకెట్ లాగే ఉన్న క‌ల్తీ ప్యాకెట్‌

మారుతున్న కాలానికి అనుగుణంగా తిండిలో కూడా మార్పులు వ‌స్తున్నాయి.ఒక‌ప్పుడు అచ్చ‌మైన, స్వ‌చ్ఛ‌మైన తిండిని తినేవారు.

 Dupicate Milk Packet Which Looks Like The Original Milk Packet, Viral Pic, Milk-TeluguStop.com

అందుకే వారంతా చ‌నిపోయే దాకా ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా హాయిగా బ్రతికేశారు.కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు ఉన్నాయా.

మ‌ధ్య వ‌య‌స్సులోకి వ‌చ్చే స‌రికే స‌ర్వ రోగాలు వెంటాడుతున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం తినే తిండిలో లోపాలే.

ఇప్పుడు ఉన్న వ‌న్నీ క‌ల్తీ ఆహార ప‌దార్థాలే.కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో వ‌స్తున్న‌వ‌న్నీ కూడా పూర్తి స్థాయి నాణ్య‌త లేనివే.

ఇలాంటి క‌ల్తీ ఆహారాలు తిన్న త‌ర్వాత ఆరోగ్యంగా ఎలా ఉంటారు.

ఇక క‌ల్తీ వ్యాపారుల గుట్టు అక్క‌డ‌క్క‌డా బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

వారిపై ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కూడా అటు కంపెనీ వ్యాపారుల‌ను, ఇటు క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేస్తూ అచ్చం కంపెనీ త‌యారు చేసిన‌ట్టే క‌ల్తీ వ్యాపారులు వ‌స్తువుల‌ను త‌యారు చేస్తున్నారు.వీటిని గుర్తు ప‌ట్టడం అంటే అంత ఈజీ కాదు.

ఇప్పుడు పాల‌ల్లో జ‌రుగుతున్న క‌ల్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.కాగా ఇప్పుడు అచ్చం కంపెనీ ప్యాకెట్‌ను పోలిన క‌ల్తీ ప్యాకెట్ ఫొటోలు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.

వాటిని చూస్తే అచ్చం కంపెనీ త‌యారు చేసిన ప్యాకెట్ల‌లాగే ఉన్నాయి
.

Telugu Milk, Frud, Milk Packet-Latest News - Telugu

ఇక్క‌డ మ‌న‌కు క‌నిపిస్తున్న పాల ప్యాకెట్ల ఫొటోలో ఏది క‌ల్తీదో ఏది వ‌ర్జిన‌లో క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం.రెండు కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి.ఇందులో అమూల్ పాల ప్యాకెట్ ను పోలిన‌ట్టు కొంద‌రు న‌కిలీవాటిని త‌యారు చేస్తున్నారు.

అమూల్ బ్రాండ్ ను పోలిన‌ట్టే క‌ల్తీ ప్యాకెట్‌ను ముద్రించి అమ్మేస్తున్నారు.ఆ న‌క‌ల్తీ ప్యాకెట్‌లో ఉన్న‌వి మొత్తం క‌ల్తీ పాలే.

వాటిని తాగితే ప్రాణానికే ప్ర‌మాదం అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.ఇలాంటి న‌కిలీ ప్యాకెట్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, త‌మ కంపెనీ బ్రాండ్ ఉన్న వాటిని మాత్ర‌మే కొనాలంటూ చెబుతున్నారు కంపెనీ య‌జ‌మానులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube