ఆన్ లైన్ లో పిడకలు అమ్మేస్తున్నారు

అగ్గిపుల్లా… కుక్కపిల్లా… సబ్బుబిల్లా… ఇలా ఆన్‌లైన్‌లో దొరకనిదంటూ ఏదీ లేదు.ఆ లిస్టులో ఇప్పుడు పిడకలు కూడా చేరిపోయాయి.

 Dung Cakes Are Sold Online-TeluguStop.com

ఆన్‌లైన్‌లో పిడకల వేట అనేది కొత్త ట్రెండ్‌గా మారింది.కేవలం పిడకలను ఆన్‌లైన్‌లో అమ్ముతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారూ ఉన్నారు.

చిత్తూరు జిల్లా ఎగువ తవణంపల్లె గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డి బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు.కొంతకాలం బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు.

బెంగళూరులో ఉన్న సమయంలో ఆవుపేడతో చేసిన పిడకలు తగినన్ని అందుబాటులో లేవని గుర్తించాడు

అంతే వెంటనే తన ఆలోచనలకు పదును పెట్టి.ఆన్‌లైన్‌లో ఆవు పిడకలను అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు.

స్వగ్రామానికి చేరుకున్న వినోద్‌రెడ్డి 2 నాటు ఆవులు, 4 పుంగనూరు జాతి అవులను తీసుకువచ్చాడు.వాటి నుంచి వచ్చే పేడతో పిడకలను తయారు చేయిస్తున్నాడు.

వాటిని తనకున్న నాలెడ్జ్‌తో ఆన్‌లైన్‌లో మార్కెట్‌ చేయడం మొదలు పెట్టాడు.శుభకార్యాలు, పండుగలు, హోమాలు, యజ్ఞాలు, దహన సంస్కారాలకు పిడకల అవసరం భారీగా ఉంటోంది.

దీంతో వినోద్‌రెడ్డి పిడకల వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతోంది.ఆన్‌లైన్‌లో పిడకలు అమ్మకం కొనసాగిస్తున్న వినోద్‌రెడ్డి.

బెంగళూరులో ఉద్యోగాన్ని వదిలేసి ఇంటిదగ్గరే ఉంటూ ఉంటూ తన తండ్రికి పొలం పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube