ప్రేక్షకులకు స్లోగా ఎక్కుతున్న 'సీతారామం'.. థియేటర్స్ హౌస్ ఫుల్!

ఈ ఆగష్టు నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఈ నెల మొత్తం కూడా పెద్ద సినిమాల నుండి మీడియం రేంజ్ చిన్న సినిమాలు మొత్తం కూడా వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

 Dulquer Salmaan's 'sita Ramam' To Magic In Theatres, Dulquer Salmaan, Hanu Ragha-TeluguStop.com

గత జులై నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనేవే పడలేదు.వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతూ వస్తున్నాయి.

అందుకే ఆగష్టు నెలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం అందరు ఎదురు చూసారు.

ఇక ఎట్టకేలకు ఆగష్టు ఫస్ట్ వారంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పించడంతో కలెక్షన్స్ మోత మోగిపోతుంది.చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్స్ పడే సరికి టాలీవుడ్ కి కొత్త కళ వచ్చింది.

మరి ఫస్ట్ వారంలో రిలీజ్ అయినా సినిమాల్లో సీతా రామం ఒకటి.

హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం.

యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.

Telugu Ashwini Dutt, Dulquer Salmaan, Mrunal Thakur, Sita Ramam-Movie

ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించారు.ఆగష్టు 5న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ అంతా చాలా ఖుషీగా ఉన్నారు.మొదట్లో ఈ సినిమాను అంతగా పట్టించుకోక పోయిన ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ సినిమాను చూసాం అనే భావన వస్తుంది అని రివ్యూలు రావడంతో థియేటర్స్ కు ప్రేక్షకులు మెల్లమెల్లగా రావడం మెడలు పెట్టారు.
దీంతో ఈ సినిమా కి ఆదరణ మరింత పెరుగుతున్నట్టు తెలుస్తుంది.ఫస్ట్ డే కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుండడంతో ఈ సినిమా మ్యాజిక్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది.

ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube