ఆ జాబితాలో చేరిపోయిన దుల్కర్.. ఇక ఇక్కడ ఈయనకు తిరుగులేదంతే!

టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు అంత డిమాండ్ ఉండదు.ఇక్కడ వేరే సినిమాలు హిట్ అయినవి చాలా తక్కువగానే ఉన్నాయి.

 Dulquer Salmaan Craze In Telugu Industry Details, Dulquer Salmaan, Hanu Raghavap-TeluguStop.com

మన తెలుగు ప్రేక్షకులకు నచ్చాలంటే చాలా కష్టం.ఈ జాబితాలో పక్క ఇండస్ట్రీల హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

తమిళ్ హీరోల్లో రజనీ కాంత్, కమల్ హాసన్ బాగా రాణించారు.ఆ తర్వాత సూర్య, కార్తీ మాత్రమే తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు.

అయితే ఇప్పటి వరకు ఇలా తమిళ్ హీరోలు మాత్రమే క్రేజ్ అందుకున్నారు.కానీ ఫర్ ది ఫస్ట్ టైం మలయాళ హీరో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు.

ఆయనే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈయనపై ఎంత అభిమానం ఏర్పడిందంటే.

ఏకంగా ఈయన భారీ కటౌట్ సైతం ఏర్పాటు చేసి తెలుగు ప్రేక్షకులు తమ అభిమానం చాటుకున్నారు.

మాలీవుడ్ లో దుల్కర్ ఫ్యాన్స్ సైతం ఈ కటౌట్ గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సీతా రామం. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.

Telugu Dulquer Salmaan, Dulquersalmaan, Mahanati, Mollywood, Mrunal Thakur, Sita

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా కంటే ముందు దుల్కర్ మహానటి సినిమాలో నటించాడు.కానీ అప్పుడు అంత పేరు రాలేదు.అయితే ఇప్పుడు మాత్రం సీతా రామం సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకుల పూర్తి అభిమానం పొందాడు.

ఈ సినిమాతో దుల్కర్ టాలీవుడ్ హీరోల తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.

యంగ్ హీరోల జాబితాలో ఈయన పేరు కూడా చేర్చారు.ఇలా దుల్కర్ మాత్రమే మలయాళ స్టార్ అయినా తెలుగులో ఆదరణ పొందుతున్నాడు.

తెలుగు అభిమానం పొందిన పక్క ఇండస్ట్రీల హీరోల జాబితాలో దుల్కర్ చేరిపోవడంతో ఈయనకు ఇక తిరుగులేదు అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube