ఆస్తి తగాదాల కారణంగా అందరూ చూస్తుండగానే కొడవలితో నరికి వ్యక్తి దారుణ హత్య..!

ఇటీవల కాలంలో తరచూ ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యాచారాలు, అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసి కఠినంగా శిక్షించిన దారుణాలు మాత్రం ఆగడం లేదు.

 Due To Property Disputes, A Man Was Brutally Killed By Machete While Everyone Wa-TeluguStop.com

ఓ వ్యక్తి జనాలు చూస్తుండగానే కొడవలితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలో( Karnataka ) వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపుతుంటే.అటుగా వెళుతున్న జనాలంతా ఆపే ప్రయత్నం చేయకుండా ఆ దృశ్యాలను తమ ఫోన్ల ద్వారా వీడియోలు తీశారు.

Telugu Brutally, Dharwad, Karnataka, Machete-Latest News - Telugu

ఈ హత్యకు సంబంధించిన ఘటన అంతా పక్కనే ఉన్న సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయింది.పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు 60 ఏళ్ల నింగప్ప హడపాడ( Ningappa Hadapada ) గా గుర్తించారు.మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే హత్య చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Telugu Brutally, Dharwad, Karnataka, Machete-Latest News - Telugu

పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతనే హత్యకు గల కారణాలు ఏమిటో వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.నిందితుడు ఏమాత్రం భయం పెరుగు లేకుండా బాధితులపై దాడి చేసి హతమార్చాడు.పైగా ఇదంతా స్థానికులు చూస్తూ ఉండగా చేయడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం ఉండదని స్థానికులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube