జూన్‌ లో మళ్లీ టాలీవుడ్‌ సందడి మొదలు

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో అన్ని భాషల సినిమాల చిత్రీకరణ నిలిచి పోయాయి.కరోనా కారణంగా అన్ని భాషల సినిమాల షూటింగ్ లు నిలిచి పోతున్న నేపథ్యంలో సినిమాల విడుదల కూడా నిలిచి పోయాయి.

 Due To Corona Second Wave All Movie Shootings Stopped In June They Will Be Start-TeluguStop.com

మొత్తంగా దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది.పెద్ద సినిమా లు మొన్నటి వరకు షూటింగ్ ను జరుపుకున్నా కూడా ఇప్పుడు నిలిచి పోయాయి.

మళ్లీ షూటింగ్ లు ఎప్పుడెప్పుడు మొదలు అవుతాయా అంటూ సినీ వర్గాల వారితో పాటు మీడియా వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈసమయం లో ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కరోనా సెకండ్‌ వేవ్‌ జూన్‌ నెలకు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

కనుక జూన్‌ లో మళ్లీ షూటింగ్ ల సందడి మొదలు అయ్యే అవకాశం ఉందంటూ వారు అనుమానంగానే చెబుతున్నారు.

టాలీవుడ్‌ లో సినిమా ల షూటింగ్‌ లు గత ఏడాది చివర్లో ప్రారంభం అయ్యి మెల్ల మెల్లగా జోరు అందుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ బ్రేక్‌ పడింది.

షూటింగ్ లకు బ్రేక్ పడటంతో సినీ కార్మికులు వేలాది మంది పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు.సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులు మరియు ఇతర వర్గాల వారు అంతా కూడా షూటింగ్ ల కోసం వెయిట్‌ చేస్తున్నారు.

మళ్లీ షూటింగ్‌ ను మొదలు పెట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కృష్ణ నగర్‌ యూసుఫ్‌ గూడ బస్తీల్లో ఉండే వారు అంటున్నారు.ఫిల్మ్‌ నగర్‌ వీధుల్లో జనాలు తిరుగుతున్న దాఖలాలే కనిపించడం లేదు.

ఒకటి రెండు సినిమా లు షూటింగ్‌ జరుగుతున్నా కూడా అవి ఇండోర్‌ ల్లో చేస్తున్నారు.దాంతో షూటింగ్‌ సినిమా ల షూటింగ్ ల సందడే లేదు.

ఈ ఏడాది అంతా కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉందంటున్నారు కొందరు.ఒక వేళ థర్డ్‌ వేవ్‌ వస్తే పరిస్థితి ఏంటీ అంటూ ఇప్పటి నుండే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube