బాతు రెక్క‌ల‌పై నీటి చుక్క ఎందుకు నిల‌వ‌దు? కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ఇంగ్లీషులో వాట‌ర్ ఆఫ్ ఎ డ‌క్స్ బ్యాక్ అనే సామెత ఉంది.దీని అర్థం ఎవరూ ఎలాంటి విమర్శలను పట్టించుకోకూడదు అని అర్థం.

 Ducks Are Always Clean And Are They Waterproof Details, Clean , Waterproof, Duck-TeluguStop.com

బాతు నీటిలో ఈత కొట్టడాన్ని మీరు చాలా సార్లు చూసే ఉంటారు.బాతులు ఎంతో ప‌రిశుభ్రంగా క‌నిపిస్తాయి.

దీని వెనుక గ‌ల కార‌ణ‌మేమిట‌ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజంతా నీటిలో ఉన్నప్పటికీ, బాతు ఈకలు తడిగా ఉండవు.దీనికి కార‌ణ‌మేమిటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? బాతు రెక్కలు వాట‌ర్ ప్రూఫ్ క‌లిగినావా? అని అనుకుంటే అది నిజం కాదు.నిజానికి బాతులు కాలానుగుణంగా ఒక ప్రక్రియను కొన‌సాగిస్తాయి.దీనినే ప్రీనింగ్ అంటారు.ఈ ప్రక్రియ కార‌ణంగా వాటి రెక్క‌లు పొడిగా ఉంటాయి.రెక్క‌ల‌పై నీరు నిల‌వ‌దు.

ప్రీనింగ్  ప్రక్రియలో దాని శరీరం నుండి నూనె లాంటి పదార్థం బయటకు వస్తుంది.ఫ‌లితంగా వాటి రెక్క‌లు ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంటాయి.

అలాగే మృదువుగానూ ఉంటాయి.ఈ ప్ర‌క్రియ‌లో జిడ్డు గ‌ల‌ పదార్ధం బాతు రెక్కలపై ఏర్పడుతుంది, కొన్నిసార్లు బాతు త‌న ముక్కుతో రెక్క‌ల‌పై ఏదో చేస్తుండ‌టాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు.

ఈ సమయంలో అది ప్రీనింగ్ చేస్తున్న‌ద‌ని అర్థం.కాగా బాతులు ఇటీవ‌లి కాలంలో గ్రామాలలో కూడా అరుదుగా కనిపిస్తున్నాయి.

Telugu Birds, Clean, Duck, Feather, Process, Droplets, Drops, Waterproof-General

బాతులకు ప్రమాదాలు ఎక్కువగా ఎదుర‌వుతుంటాయి.తాబేళ్ళు, మొసళ్ళు, నక్కల వంటి జంతువులే కాకుండా గద్దలు, గుడ్లగూబలు లాంటి పక్షులు కూడా బాతుల‌ను వేటాడి తింటాయి.చాలా రకాల బాతులు ప్ర‌స్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి.అలనాటి కుటుంబానికి చెందిన పక్షులే బాతులు.ఇవి ఎక్కువ కాలం చెరువుల్లోనూ ఈదుతూ జీవిస్తాయి.గింజలూ, పురుగులే వీటి ప్ర‌ధాన ఆహారం.

బాతుల్లో ఎన్నో రకాల ఉపజాతులు ఉన్నాయి.కొన్ని రకాల బాతులు చేపలనూ, గడ్డిని కూడా తింటాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube