వైరల్ వీడియో: మొసళ్లకు చిక్కిన బాతు.. చివరికి..?!

కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది.అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు.

 Viral Video Duck Brilliantly Escapes From Crocodile Trap , Viral, Viral Video, S-TeluguStop.com

కాబట్టి నేటి రోజులలో చాలా మంది తమ టైంని కరోనా కేసుల గురించి తెలుసుకోవడానికో లేదా కరోనా రాకుండా ఏం చేయాలని సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు.కొన్ని వీడియోలను చూసి భయపడిపోతుంటారు.

ఇంకొన్ని వీడియోలను చూసి ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు.అయితే మానసిక నిపుణులు మాత్రం ఓ విషయం చెబుతున్నారు.

తమకు ఉల్లాసాన్ని కలిగించే వీడియోలను, ఆనందాన్ని కలిగించే వీడియోలను చూడాలని చెబుతున్నారు.ఇలాంటి వీడియోనే తాజాగా ఒకటి వైరల్ అవుతోంది.

మొసలి ఉడుంపట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నీటిలో ఉన్నప్పుడు ఎంతటి జంతువు అయినా కూడా దాని ముందు బలాదూరే.

ఏ జంతువు వచ్చినా కూడా దానికి ఆహారంగా మారిపోవాల్సిందే.అలాంటి మొసలి నోటికి చిక్కకుండా ఓ బాతు చాకచక్యంగా తప్పించుకుంది.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ నది ఒడ్డున లెక్కలేనన్ని మొసళ్లు చక్కగా సేద తీరుతున్నాయి.

అటుగా వచ్చిన బాతు.వాటిని దాటుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.

అయితే అదును చూసుకుని ఆ మొసళ్లు బాతుపై దాడికి దిగుతాయి.

కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు.బాతు సురక్షితంగా వాటిని తప్పించుకుని వెళ్ళిపోతుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘బాతు భలే తప్పించుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పటికే ఈ వీడియో దాదాపుగా లక్ష వ్యూస్ సంపాదించుకోవడం విశేషం.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.బాతు చేసిన పనికి కొందరు సంతోషపడుతుంటే మరికొందరు దానిని ఆదర్శంగా తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.

కరోనా టైంలో అందరూ ఇలాగే ధైర్యంగా ఉండాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube