‘RAPO20’ మూవీ అప్డేట్.. డబ్బింగ్ వర్క్ స్టార్ట్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ఇష్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి యాక్షన్ సినిమాలతో అలరించాడు.ఇక ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinu) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

 Dubbing Works Started For Boyapati Ram Pothineni Rapo20-TeluguStop.com

ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి.రామ్ కథానాయకుడిగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.

ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేసులో నిలపబోతున్నారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.

రామ్ కెరీర్ లో 20వ (RAPO20) సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

డబ్బింగ్ రూమ్ లో ఉన్న బోయపాటి ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయం అనౌన్స్ చేసారు మేకర్స్.ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.50 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్టు టాక్.బోయపాటి హిట్స్ తో మంచి ఫామ్ లో ఉండడంతో నిర్మాత ఈ సినిమాకు బడ్జెట్ పెట్టడానికి వెనుకాడలేదు.

టైర్ 2 హీరోకు ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాములు విషయం కాదు.కానీ బోయపాటి శ్రీను ఉన్నాడు అనే కాన్ఫిడెంట్ తో ఈ రేంజ్ లో పెట్టారు.అఖండ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇంకా పేరు పెట్టని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయ్ దళపతి లియో సినిమాతో పోటీ పడబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube