డబ్బా కొట్టిన డబ్బింగ్.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ వైనం

తెలుగులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా డబ్బింగ్ సినిమాలు చూసే మజానే వేరు.ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాలను తెలుగు డబ్బింగ్‌లో చూస్తుంటే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది.

 Dubbing Movies Failed At Telugu Box Office In 2019-TeluguStop.com

ఇక తమిళ, కన్నడ, హిందీ వంటి సినిమాలను తెలుగులో డబ్ చేసి వదలగా వాటిని చూస్తున్నంత సేపు ఆ ఎంజాయ్‌మెంట్ వేరేగా ఉంటుంది.అయితే కొన్ని సినిమాలు మనల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తే మరికొన్ని సినిమాలు మన బుర్రలు పాడు చేశాయి.

ఈ సంవత్సరంలో మనల్ని అలరించిన డబ్బా సినిమాలు అదేనండి డబ్బింగ్ సినిమాలకంటే కూడా మన మెదడులు తిన్న డబ్బింగ్ సినిమాల సంఖ్యే ఎక్కువ.రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ మొదలుకొని, చిన్న సినిమా హీరోల వరకు చేసిన ప్రతి సినిమా మనల్ని ఏదో ఒక రకంగా విసిగించాయి.

బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా వచ్చిన సినిమాలను మన నిర్మాతలు డబ్బింగ్ చేసి మనముందుకు వదిలారు.అయితే వాటిలో కార్తీ నటించిన ఖైదీ, విజయ్ నటించిన విజిల్ వంటి సినిమాలు తప్పితే మరే ఇతర సినిమాలు కూడా మనల్ని అలరించలేదు.

అందుకే డబ్బా(డబ్బింగ్) సినిమాలు చూసేందుకు తెలుగు ఆడియెన్స్ ఆసక్తి చూపించడం లేదు.దీంతో ఈ ఏడాది అనగా 2019లో వాటి హవా అంతంతమాత్రంగా కూడా లేదని చెప్పాలి.

మరి వచ్చే ఏడాదిలోనైనా డబ్బింగ్ సినిమాల హవా సాగుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube