థియేటర్లు తెరుచుకుంటే ముందుగా రిలీజ్ అయ్యేవి ఈ సినిమాలే!  

Dubbing Movie To Release First In Tollywood, Dubbing Movie, Tamil Movies, Tollywood News, Lockdown - Telugu Dubbing Movie, Lockdown, Tamil Movies, Tollywood News

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ రంగానికి చెందిన అన్ని పనుల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూత పడి మూడు నెలలు కావస్తోంది.

 Dubbing Movie To Release First In Tollywood

ఇక కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని అందరికీ తెలిసిందే.దీంతో తెలుగు స్టార్ హీరోల దగ్గర్నుండి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని కూడా వాయిదా పడ్డాయి.

అయితే ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు వెంటనే సినిమాలు చూసేందుకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఇప్పుడు ఇదే ప్రశ్న సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.అయితే థియేటర్లు తెరుచుకోగానే తమ సినిమాలు రిలీజ్ చేయకుండా పరిస్థితులు చక్కబడ్డాకే సినిమాలు రిలీజ్ చేయాలని తెలుగు దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు.అయితే దీంతో తమిళ డబ్బింగ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయ్యిందని చెప్పాలి.

థియేటర్లు తెరుచుకుంటే ముందుగా రిలీజ్ అయ్యేవి ఈ సినిమాలే-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే పలు డబ్బింగ్ చిత్రాలు తెలుగులో రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

వీటిలో స్టార్ హీరోల చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.

తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ ఎలాగూ వాయిదా పడుతుండటంతో, తమ చిత్రాలను రిలీజ్ చేసుకుంటే వాటికి మంచి కలెక్షన్లు వస్తాయని తమిళ హీరోలు భావిస్తున్నారు.ఈ మేరకు డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు థియేటర్లు తెరుచుకోగానే సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

#Tamil Movies #Lockdown

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dubbing Movie To Release First In Tollywood Related Telugu News,Photos/Pics,Images..