హుజురాబాద్‌లో ‘దుబ్బాక’ వ్యూహం.. కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

హజురాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ అధిష్టానం ఎందుకో మౌనం వహిస్తోంది.కారణమైతే తెలీదు.

 ‘dubbaka’ Strategy In Huzurabad .. Is It A Kcr Strategy Workout ..?, Kcr, Hu-TeluguStop.com

దుబ్బాక వ్యూహం అమలులో సీఎం కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాల నుంచి వస్తున్న టాక్.ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది.

ప్రచారానికి ఇంకా 16 రోజుల సమయమే మిగిలి ఉంది.ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు దూకుడు పెంచాయి.

మంత్రి హరీష్ రావు అప్పుడప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా బీజేపీపై విమర్శలు సంధిస్తున్న గులాబీ బాస్ రాకతోనే గెలుపు తీరం చేరువ అవుతుందని పార్టీ కేడర్ భావిస్తున్నట్టు సమాచారం.అయితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం కేసీఆర్ హుజురాబాద్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

అసలు వస్తారా.రారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.

ఒకవేళ సీఎం హుజురాబాద్ పర్యటన ఫిక్స్ అయితే ఈసీ కొవిడ్ నిబంధన మేరకు వెయ్యి మందితో ప్రచారం చేస్తారా ? దుబ్బాక ఎన్నికల సమయంలో లాగా నియోజకవర్గానికి సమీప ప్రాంతంలో భారీ సభ నిర్వహిస్తారా.అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ సభ నిర్వహించాలని అనుకుంటే ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది.లేనియెడల ఈసీ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవచ్చు.

Telugu Bjp, Dalitha Bandu, Etala Rajendher, Huzurabad, Kcr, Trs-Telugu Political

దుబ్బాక వ్యూహాన్ని అనుసరిస్తే మాత్రం సీఎం కేసీఆర్ హుజురాబాద్ సరిహద్దులో భారీ సభ నిర్వహించి ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల వర్షం కురిపించే చాన్స్ లేకపోలేదు.ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కులసంఘాలతో సమావేశాలు నిర్వహించి తాము చేసిన అభివృద్ధిని చూపెట్టుకునే పనిలో పడ్డాయి.ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ దళితబంధు పథకం ప్రవేశపెట్టడమే కాకుండా, రూ.400కోట్లకు పైగా ఖర్చు చేసింది.ఇంకా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది.ఇకపోతే ఈటల రాజేందర్ తాను రాజీనామా చేయడం వల్లే హుజురాబాద్‌కు నిధుల వరద పారుతోందని, దళితబంధు వచ్చిందని ప్రచారం చేస్తున్నాడు.

దీంతో ఈటలను ఢీకొట్టాలంటే కేసీఆర్, కేటీఆర్ పర్యటన అనివార్యమని టీఆర్ఎస్ వర్గాలు అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తోంది.

Telugu Bjp, Dalitha Bandu, Etala Rajendher, Huzurabad, Kcr, Trs-Telugu Political

ఇదిలాఉంటే, సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాకముందే పెంచికల్ పేట శివారులో సభ కోసం మంత్రులు స్థల పరిశీలన కూడా జరిపారు.హుస్నాబాద్ బార్డర్ నియోజక వర్గంలో ఆ స్థలం ఉండటంతో ఈసీ అనుమతి కూడా అవసరం లేదు.ఈ సభా వేదిక కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అంతా భావిస్తున్నారు.

అయితే, తండ్రి కొడుకుల పర్యటన ఉంటుందా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube