తెలంగాణ ప్రభుత్వ పాలన పై.. దుబ్బాక ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.. !!

ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడలేని తలనొప్పులు మొదలైయ్యాయట.కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.

 Dubbaka Mla Key Remarks On Telangana Govet Rule-TeluguStop.com

అయితే ప్రత్యేక తెలంగాణ వచ్చిన జోష్‌లో ప్రజలు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తన కల నెరవేర్చుకున్న ఆనందంలో కేసీఆర్ అలా ఆ ఐదు సంవత్సరాలు ఊత్సాంతో గడిపేసారు.

ఇక రెండో సారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినప్పటి నుండి గులాభి పార్టీ పై చిన్న చిన్నగా ప్రజల్లో అసంతృప్తి మొదలైందట.

 Dubbaka Mla Key Remarks On Telangana Govet Rule-తెలంగాణ ప్రభుత్వ పాలన పై దుబ్బాక ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపధ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం.అందులో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలవడంతో అలర్ట్ అయిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయ వ్యూహలు రచించడంలో బిజీగా ఉన్నట్లుగా సమాచారం.

ఈ సమయంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది.ఈ విషయం పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శిస్తూ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేసారు.

#BJP MLA #Raghunandan Rao #DubbakaBJP #CM KCR #Dubbaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు