దుబ్బాక‌లో టీఆర్ఎస్‌కు షాక్‌.. గెలుపు బీజేపీదే... తాజా స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే...!

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో కారు పార్టీకి షాక్ త‌ప్ప‌దా ?  అంటే తాజా స‌ర్వే అవున‌నే చెపుతోంది.గ‌త ఎన్నికల్లో ఇక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట రామ‌లింగారెడ్డి 62 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

 Big Shock To Trs In Dubbaka.. Bjp Will Win,trs,telangana,bjp,dubbaka,elections,s-TeluguStop.com

ఇప్పుడు సానుభూతి నేప‌థ్యంలో కారు పార్టీ ఇక్క‌డ త‌మ‌కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుంద‌ని లెక్క‌లు వేసుకుంది.అయితే ఇటు ర‌ఘునంద‌న్ ఇప్ప‌టికే మూడుసార్లు ( రెండు సార్లు దుబ్బాక‌లో ఓ సారి మెద‌క్ ఎంపీగా) ఓడిపోవ‌డంతో ఆయ‌న‌కు కూడా ఊహించ‌ని విధంగా సానుభూతి పెరుగుతోంది.

ఇక ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా తాజా సర్వేలు మాత్రం అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.ప‌బ్లిక్ ప‌ల్స్ సంస్థ చేసిన స‌ర్వేలో ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి విజయం సాధిస్తాడ‌ని.

కారు పార్టీ ఓడిపోతుంద‌ని తేలింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పొజిష‌న్‌ను బ‌ట్టి చూస్తే టీఆర్ఎస్ అభ్య‌ర్థి కంటే బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ 1-2 శాతం ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నాడు.

మంత్రి హ‌రీష్‌రావు సైతం కాంగ్రెస్‌ను వ‌దిలేసి ప‌దే ప‌దే బిజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావును టార్గెట్ చేస్తుండ‌డం కూడా బీజేపీకి ప్ల‌స్ అవుతోంది.

Telugu Dubbaka, Harish Rao, Result, Sujatha, Telangana-Telugu Political News

ఏదేమైనా ఎన్నిక‌ల పోలింగ్ రోజు ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది దుబ్బాక అధికార పార్టీ గెలుపుపై ముందు ఉన్నంత ధీమా అయితే లేదు.ఉత్కంఠ పెరిగిపోతోంది.ఈ సర్వేల్లో వచ్చిన ఫలితాలు 2-3 శాతం అటు ఇటు అయ్యే అవకాశాలూ లేకపోలేదు.

కాబట్టి ఏమైనా జరగొచ్చు.పోల్ మేనేజ్‌మెంట్ జాగ్ర‌త్త‌గా చేసుకుంటే బీజేపీ గెలిచే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయంటున్నారు.

ఇక సర్వేలో మండ‌లాల వారీగా చూస్తే దుబ్బాక మున్సిపాల్టీలో బీజేపీకి, రూర‌ల్లో టీఆర్ఎస్‌కు లీడ్ ఉంది.మిరుదొడ్డి, రాయ‌పోల్‌, దౌల‌తాబాద్ మండ‌లాల్లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్య‌త ఉంది.తొగుంట మండ‌లంలో కాంగ్రెస్‌కు ఆధిక్య‌త క‌నిపించ‌గా, చేగుండ‌, న‌ర్సింగ్ మండ‌లాల్లో బీజేపీకి ఆధిక‌త్య ఉంది.ఈ స‌ర్వే ప్ర‌కారం చూస్తే గులాబీ పార్టీకి నాలుగు చోట్ల వ్య‌తిరేక‌త ఉంది.

మ‌రి తుది ఫ‌లితం ఎలా ఉంటుందో ?  చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube