దుబ్బాక ఆ నేత పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు అగ్నిప‌రీక్షే... తేడా వ‌స్తే అంతే...!

తెలంగాణ‌లోని దుబ్బాక ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లోనూ ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.ఓ వైపు బిహార్, మ‌రోవైపు అమెరికా ఎన్నిక‌లు ఉన్నా కూడా ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతా దుబ్బాక మీదే ఉంది.

 Dubbaka Bypolls: That Leader Facing Fire Exam In Future,telangana,bihar,harish R-TeluguStop.com

మామూలుగా ఓ అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌కు అంత ప్ర‌యార్టీ ఉండ‌దు.కాని దుబ్బాక‌లో పోటీ చేస్తోన్న మూడు పార్టీల నేత‌ల‌కు సెంటిమెంట్ ఉంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతి త‌ర్వాత సానుభూతి కోసం ఆయ‌న భార్య సుజాత‌నే పోటీ పెట్టింది.
ఇక బీజేపీ నేత ర‌ఘునంద‌న్‌రావు ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడుసార్లు ఓడిపోయినా ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నార‌న్న సానుభూతి సంపాదించుకున్నారు.

దీంతో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఓ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి చెర‌కు శ్రీనివాస్‌రెడ్డి.మాజీ మంత్రి ముత్యంరెడ్డి త‌న‌యుడు.ఆ కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరు ఉంది.

ముత్యంరెడ్డికి గులాబీ పార్టీ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసింది.అయితే ఆయ‌న‌కు ప‌ద‌వి రాకుండానే చ‌నిపోయారు.

ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాల‌ని శ్రీనివాస్‌రెడ్డి కోరినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మారి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నారు.

Telugu Bandi Sanjay, Congress, Harish Rao, War, Presidential, Telangana-Politica

ఎవ‌రెలా ఉన్నా ఈ ఉప ఎన్నిక మంత్రి హ‌రీష్‌రావుకు ఇజ్జ‌త్‌కు స‌వాల్‌గా మారింది.ముందు ఆయ‌న ఈ ఉప ఎన్నిక లైట్ తీస్కున్నా త‌ర్వాత ప‌రిస్థితి ఈజీ కాద‌ని స‌ర్వ‌శ‌క్తులా ప్రయత్నించారు.ఇక్క‌డ ఫ‌లితం కారు పార్టీకి వ్య‌తిరేకంగా వ‌స్తే కేసీఆర్‌కు ఎంత న‌ష్టం అన్న‌ది పాయింట్ కాదు.

హ‌రీష్‌రావు కెరీర్ డైల‌మాలో ప‌డిపోతుంది.ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కే కాదు.

సొంత పార్టీలోనే చాలా మంది నేత‌ల‌కు టార్గెట్‌గా మారిపోతారు.కేటీఆర్‌తో జ‌రుగుతోన్న రాజ‌కీయ సంగ్రామం రేసులో వెన‌క‌ప‌డిపోతాడు.

అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం అన్ని పార్టీల కంటే బీజేపీయే ముందు ఉంది.నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటిని బీజేపీ క‌వ‌ర్ చేసింద‌నే చెప్పాలి.ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితం హ‌రీష్‌రావు ఫ్యూచ‌ర్‌ను ఎలా డిసైడ్ చేస్తుందో ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube