స్టార్టప్ వీసా పై దుబాయి షాకింగ్ డెసిషన్       2018-07-07   04:24:06  IST  Bhanu C

దుబాయి ప్రభుత్వ విధానాలు ఒక్కొక్కటిగా మార్పు చెందుతున్నాయి..ప్రపంచ దేశాలతో పోటీ పడటానికి దుబాయి వాసులకి తెలివితేటలూ ఆర్ధిక వనరులు అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని కట్టుబాట్లు కొన్ని ఆంక్షలు వలన మరిన్ని ఫలాలు అందిపుచ్చుకోలేక పోతోంది..అందుకే దుబాయి లో సమూల మార్పులకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మహిళలకి డ్రైవింగ్ చేయమని తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది..ఇదిలాఉంటే

దుబాయ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని వెసులుబాటును వ్యాపారవేత్తలకు కల్పించేందుకు ముందుకువచ్చింది…తద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు “పదేళ్ల వీసా” కార్యక్రమంతో ప్రపంచ దేశాల్లోని వ్యాపార ఔత్సాహికులకు స్వర్గధామం కావాలని దుబాయి ఆలోచనలు చేస్తోంది..

“స్టార్టప్ వీసా” పరిమితిని ఎక్కువ కాలం పెంచేలా నూతన విధానం ప్రవేశపెడుతోంది…అయితే ఈ విధానాలని ఎందుకు తెరమీదకి తీసుకు వచ్చింది అంటే..విదేశీ వ్యాపారవేత్తలు బిజినెస్ మొదలు పెట్టి..పెట్టుబడిని తిరిగి రాబట్టుకుని, లాభాలు ఆర్జించి, ఆ తర్వాత కంపెనీ విస్తరణ చేసుకోవాడానికి కనీసం అయిదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. అయితే చాలా దేశాలు కేవలం అయిదేళ్ల కాల పరిమితితో స్టార్టప్ వీసాలను ఇస్తున్నాయి.

అయితే ఇతర దేశాల కంటే భిన్నంగా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విధానాన్ని యూఏఈ ప్రవేశపెట్టిందని అంటున్నారు విశ్లేషకులు..అయితే ఈ విధానం వలన ఎక్కువగా భారతీయ వ్యాపారవేత్తలకి లాభం చేకూరడమే కాకుండా మరిన్ని పెట్టుబడులు భారత్ నుంచీ తరలి వస్తాయి అనేది యూఏఈ అభిప్రాయం.. ఎందుకంటే యూఏలో పెట్టుబడులు పెట్టే వారిలో అధికశాతం భారతీయులు ఉండటం భరత్ అనుంచీ పెట్టుబడులు వస్తున్నాయి అనేది యూఏఈ నే అధికారికంగా ఎన్నో సార్లు వెల్లడించింది.