దుబాయి రాకుమారి పారిపోయి ఇండియాకు వచ్చింది.. సినిమా కథను తలపించే రాకుమారి బాధలు  

Dubai Princess Returns Safely To UAE With India\'s Help -

ప్రపంచంలోనే ధనికమైన దేశాల్లో ఇప్పుడు దుబాయి నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కడ చమురు నిల్వలు అధికంగా ఉండటంతో ప్రపంచ దేశాలు దుబాయిపై ఆధారపడాల్సి వస్తుంది.

Dubai Princess Returns Safely To Uae With India's Help

దాంతో దుబాయి ధనిక దేశం అయ్యింది.కంప్యూటర్‌ యుగంలో కూడా దుబాయిని ఇంకా రాజ కుటుంబం పరిపాలిస్తున్న విషయం తెల్సిందే.

దుబాయి పాలకుడైన మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ కుమార్తె షేకా లతీఫా.రాజుగారి కుమార్తె అంటే ఏ స్థాయిలో ఆమె రాజబోగాలు అనుభవించొచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దుబాయి రాకుమారి పారిపోయి ఇండియాకు వచ్చింది.. సినిమా కథను తలపించే రాకుమారి బాధలు-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని ఆమె మాత్రం తన తండ్రికి దూరంగా, దుబాయికి దూరంగా బతకాలని కోరుకుంటుంది.అందుకోసం పలు సార్లు పారిపోయే ప్రయత్నం కూడా చేసింది.?

లతీఫాకు స్వాతంత్య్ర జీవనం అంటే చాలా ఇష్టం.కాని దుబాయిలో అది సాధ్యం కాదు.ముఖ్యంగా రాజ కుటుంబంకు చెందిన వారు ఎవరు కూడా బయటి వారితో సంబంధం పెట్టుకోకుండా ఉండాలి, అలాగే రాజ కుటుంబంలోని ఆడవారు బయటి ప్రపంచానికి కనీసం మొహం కూడా చూపించకూడదు.ముస్లీం కుటుంబం కనుక ఎన్నో పద్దతులు, పట్టింపులు ఉంటాయి.

అవన్ని కూడా ఆమెకు నచ్చవు.హాయిగా పక్షిలా విహరించాలనేది ఆమె కోరిక.

అందుకోసం ఎన్నో విఫల ప్రయత్నాు చేసింది.ఆమద్య పారిపోయి ఇండియాకు కూడా వచ్చింది.

తన స్నేహితురాలితో కలిసి ఒక నౌకలో సుదీర్ఘ ప్రయాణం చేసి లతీఫా ఇండియా బౌర్డర్‌లోకి వచ్చింది.గోవాకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న వారి నౌకను భారత సైనికులు గమనించారు.ఆ నౌక వద్దకు పెద్ద ఎత్తున సేనలు వెళ్లారు.మొదట నౌకను శత్రు దేశం నౌకగా భావించి కాల్పురు జరిపారు.ఆ తర్వాత అందులోంచి లతీఫా బయటకు రావడంతో కాల్పులు విరమింపజేశారు.వివరాలు తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది వెంటనే ఆమెను దుబాయికి పంపించారు.

ఈ సంఘటన జరిగి కొన్నాళ్లు అవుతుంది.ఆమె ప్రస్తుతం దుబాయి రాజ భవనంలో బలవంతంగా ఉంచబడినది.దాంతో ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సంఘం వారు ఆమె కోసం పోరాడుతున్నారు.ఆమె కోరుకున్న స్వేచ్చను దుబాయి రాజు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

కాని దుబాయి రాజు మాత్రం ఇది తమ కుటుంబ వ్యవహారం అన్నట్లుగా కొట్టి పారేస్తున్నాడు.రాకుమారి అయినా బందించడం వల్ల బాధగానే ఉంటుందని లతీఫా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు