క్యాన్సర్ కారణంగా అతడి పొట్ట తొలగించాలన్నారు డాక్టర్లు..పొట్ట లేకుండా ఆహారం తినకుండా అతడు ఎలా బతుకుతాడు??

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో పొట్ట క్యాన్సర్ ఒకటి.యువతలో ఎక్కువగా ఈ పొట్ట క్యాన్సర్‌ కనిపిస్తుంది.

 Dubai Man Asks For Biryani Before Getting Stomach Surgically Removed-TeluguStop.com

అయితే మనకు తెలుసు మన శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ సోకితే ఆ పార్ట్ ను తొలగిస్తారు.ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్.ఇప్పుడు ఈ పొట్ట క్యాన్సర్ అయితే పొట్ట క్యాన్సర్ వస్తే పొట్టను తీసేస్తారని మీకు తెలుసా?పొట్ట లేకుండా ఆ మనిషి ఏం తింటాడు?ఎలా బతుకుతాడు? తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…

దుబాయ్ కి చెందిన గులామ్ అబ్బాస్ అనే వ్యక్తి ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.ఆయన చాలా సంతోషంగా తన కుటుంబంతో జీవిస్తున్న సమయంలో ప్రమాదం క్యాన్సర్ రూపంలో అతని జీవితంలోకి వచ్చింది.అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన అబ్బాస్‌ను పరిశీలించిన వైద్యులు కడుపులో కేన్సర్ వచ్చిందని, అది కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పారు.వెంటనే కడుపును తొలగించాలి, లేకపోతే చనిపోతావని చెప్పారు.

అబ్బాస్ తను లేకుండా తన పిల్లలు ఉండలేరని, వారి ఎదుగుదలను తాను చూడాలని వైద్యులను కోరాడు.దీంతో అబ్బాస్ పొట్టను తొలగించడానికి వైద్యులు సిద్దమయ్యారు… సర్జరీ చేసే ముందు తన చిన్న కోరిక తీర్చాలని డాక్టర్లను వేడుకున్నాడు అబ్బాస్…అతడు కోరిన కోరికేంటంటే…

తన పొట్టను తొలగిస్తే ఇకపై నేను జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసే బిర్యానీ తినడం కుదరదు.

కాబట్టి ఆపరేషన్ చేసే ముందు ఒక్కసారి తన భార్య చేసే బిర్యానీ తింటానని,దానికి అనుమతించాలని వైధ్యులను కోరాడు.దానికి వైధ్యులు కూడా అంగీకారం తెలిపారు.

అయితే ఇక్కడే అందరికి ఒక డౌట్ .పొట్ట లేకుండా అబ్బాస్‌ ఎలా బతకగలడు అని? అయితే పొట్ట లేకుండా బతకడమంటే పూర్తిగా తిండి మానేయడం కాదు.మసాలాలు,ఘాటుగా ఉండే పదార్దాలు ,మరియు ఏ ఆహారపదార్ధమైన ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి వీల్లేదు.

మరి వారు తీసుకున్న తక్కువ మోతాదులోని ఆహారం ఏమవుతుంది.పొట్ట లేకుండా ఉన్నవారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని కన్సల్టెంట్‌ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్‌ అల్ మార్జౌకి తెలిపారు.ఇప్పటివరకు పెద్ద ప్రేగు క్యాన్సర్‌ సర్జరీలు చాలా జరిగాయి, కానీ పొట్టమొత్తం తీసేసే సర్జరీని జరగడం ఇదే తొలిసారి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube