దుబాయ్ : భారతీయ యువకుడిని వరించిన అదృష్టం...కార్ వాషర్ నుంచీ కోటీశ్వరుడిగా....

జీవితంలో అన్నీ కష్టాలే, ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు, మరో పక్క భార్యా, ఇద్దరు పిల్లలు, మరో పక్క బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న తమ్ముడు.ఈ పరిస్థితులను అధిగమించేందుకు గాను భారత్ లోని నేపాల్ నుంచీ దుబాయ్ వెళ్లి అక్కడ కార్లు వాష్ చేసే ఉద్యోగంలో చేరాడు భారతీయ యువకుడు.చిన్న వయసులోనే అన్ని బరువు బాధ్యతలు మోస్తూ వచ్చే రూ.28 వేల జీతంతో తనకు ఖర్చు పెట్టుకుని మిగిలిన మొత్తం ఇంటికే పంపేవాడు.అయితే తమ్ముడి వైద్య ఖర్చుల కోసం ఎంత కూడబెట్టాలని అనుకున్నా సాధ్యమయ్యేది కాదు.ఈ క్రమంలోఊహించని విధంగా అతడి జీవితం దుబాయ్ మాజూజ్ రాఫెల్ డ్రా రూపంలో మలుపు తిరిగింది.

 Dubai: Lucky Indian Youth Turned From A Car Washer To A Millionaire Mazooz Raffl-TeluguStop.com

ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా రూ.22 కోట్ల భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు.వివరాలోకి వెళ్తేనేపాల్ కి చెందిన భరత్ తన తమ్ముడి వైద్య చికిత్స కోసం డబ్బులు కూడా బెట్టేందుకు దుబాయ్ వెళ్ళాడు.ఎన్నో ఏళ్ళుగా దుబాయ్ లోనే పనిచేస్తూ వచ్చే జీతంలో కొంత తన వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని నేపాల్ లో ఉన్న కుటుంబానికి పంపేవాడు.

బ్రెయిన్ ట్యూమర్ వైద్యం అంటే వేలల్లో కాదు లక్షల్లో ఖర్చు అవుతుంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న భరత్ కు తోటి సన్నిహితులు మహాజూజ్ లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోమని సలహా ఇచ్చారు.దాంతో.

Telugu Bharat, Car Washer, Dubai, India, Lottery Ticket, Mazooz Raffle, Milliona

గడిచిన కొంత కాలంగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నా ఉపయోగం లేకపోయింది.కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో చివరిసారిగా టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే ఊహించని విధంగా మహాజూజ్ లాటరీ నిర్వాహకుల నుంచీ ఫోన్ రావడం రూ.22 కోట్లు గెలుచుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు భరత్.తన కష్టాలు తీరిపోయాయంటూ సంతోషం వ్యక్తం చేశాడు.ఈ డబ్బుతో ముందుగా తన తమ్ముడికి చికిత్స చేయిస్తానని, మిగిలిన డబ్బుతో పిల్లలను మంచి చదువులు చదివించుతానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube