దుబాయ్ : భారతీయుడికి భారీ జరిమానా....రూ. 9956 కోట్లు చెల్లించాలంటూ కీలక తీర్పు...!!

అందిన కాడికి దోచుకుని విదేశాలు చెక్కేసి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ సంపన్నులు ఎంతో మంది ఉన్నారు ప్రత్యేకించి చెప్పక పోయినా వారి లిస్టు పెద్దదే.అయితే విదేశాలలో స్థిరపడి అక్కడ ప్రభుత్వాలకు టోకరా పెట్టి మరో దేశం చెక్కేసిన ఓ భారతీయుడి గుర్తించి ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నాం.

 Dubai: Heavy Fine For An Indian...rs. 9956 Crores To Be Paid Key Verdict ,dubai,-TeluguStop.com

అయితే తమని మోసం చేసిన దేశం అతడిని మాత్రం వదలలేదు ఏ దేశంలో తల దాచుకున్నా సరే వదల బొమ్మాలి అంటూ అతడిని వెంటాడింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.

సంజయ్ షా.డెన్మార్క్ ఈ పేరు వింటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతుంది.ఆ దేశంలో ఉంటూ భారీ కుంబకోణం చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్న భారత సంతతి వ్యక్తిగా సంజయ్ షా ఎంతో అపకీర్తిని మూటగట్టుకున్నాడు.2012 లో డెన్మార్క్ లో మూడేళ్ళగా ఆదాయపు పన్ను కుంబకోణం జరిగిందని ఈ భారీ కుంభకోణంలో సంజయ్ కీలక పాత్ర పోషించాడని ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి.పలు విదేశీ సంస్థలకు డెన్మార్క్ లోని పలు కంపెనీలలో వాటాలు ఉన్నట్టుగా చూపించి ట్యాక్స్ నుంచీ తప్పించుకున్నాడని ఈ క్రమంలో 1.7 డాలర్ల నష్టం జరిగిందని డెన్మార్క్ తెలిపింది.ఈ కుంబకోణం బయటపడటంతో అతడు డెన్మార్క్ నుంచీ దుబాయ్ పారిపోయి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని డెన్మార్క్ ఆరోపించింది.

Telugu Denmark, Dubai, Dubai Denmark, Tax, Tax Scam, Indian, Rs, Sanjay Shah-Tel

ఎంతో మంది ఆర్ధిక నేరగాళ్లకు దుబాయ్ ఆతిధ్యం ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇతర దేశాలలో నేరగాళ్ళుగా పరిగణించే వారు దుబాయ్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నా బహిరంగంగా తిరుగుతున్నా సరే దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే గడిచిన కొన్నేళ్లుగా సంజయ్ షా దుబాయ్ లోనే ఉన్నా తాము ఏం చేయలేని పరిస్థితులో ఉండిపోయామని డెన్మార్క్ తెలిపింది.

ప్రస్తుతం దుబాయ్ – డెన్మార్క్ ల మధ్య నేరస్తుల అప్పగింత విషయంలో ఒప్పందాలు ఉన్న క్రమంలో దుబాయ్ పోలీసులు సంజయ్ షా ను అరెస్ట్ చేశారు.కోర్టులో హాజరు పరిచిన తరువాత వాదోపవాదాలు విన్న దుబాయ్ కోర్టు షా డెన్మార్క్ కు రూ.9956 కోట్లు చెల్లించాలంటూ కీలక తీర్పు వెల్లడించింది.అలాగే షా ను తమకు అప్పగించాలని కోరుతూ డెన్మార్క్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

ఇదిలాఉంటే షా అమాయకుడని కుట్ర పూరితంగా అతడిని ఇరికించారని ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకుంటామని ఆయన తరుపు న్యాయవాదులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube