భారతీయ చిన్నారి చివరి కోరిక తీర్చిన దుబాయ్ యువరాజు  

dubai crown prince meets boy 7 suffering from cancer - Telugu Boy Suffering From Cancer, Dubai Crown Prince, Sheikh Hamdan Bin Mohammed Bin Rashid Al Maktoum

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.క్యాన్సర్‌తో బాధపడుతున్న భారతీయ చిన్నారి చివరి కోరికను తీర్చి అతనిలో ఆనందాన్ని నింపాడు.

TeluguStop.com - Dubai Crown Prince Meets Boy 7 Suffering From Cancer

హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్లా హుస్సేన్‌ అనే ఏడేళ్ల బాలుడికి క్యాన్సర్ మూడో దశలో ఉంది.అతనికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమ్దాన్ అంటే చాలా ఇష్టం.

వీలు కుదిరినప్పుడల్లా హమ్దాన్ గుర్రపు స్వారీ, స్కూబా డైవింగ్ ఇతరత్రా విన్యాసాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో చూసేవాడు.ఈ క్రమంలో అతనికి క్యాన్సర్ సోకింది, ప్రస్తుతం అది మూడో దశలో ఉంది.

TeluguStop.com - భారతీయ చిన్నారి చివరి కోరిక తీర్చిన దుబాయ్ యువరాజు-Telugu NRI-Telugu Tollywood Photo Image

చిన్నారి ఇక ఎక్కువ రోజులు బతకడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అబ్దుల్లా ఎక్కువసేపు కూర్చోలేకపోవడంతో బాలుడిని తల్లిదండ్రులు పాఠశాలకు పంపడం మాన్పించేశారు.

ఇదే సమయంలో తనకు దుబాయ్ యువరాజును చూడాలని, అతనితో మాట్లాడాలని వుందని తల్లిదండ్రులకు అబ్దుల్లా చెప్పాడు.దీంతో వారు తమ కుమారుడి కోరికను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘‘అయామ్‌ యువర్‌ ఫ్యాన్‌ షేక్‌ హమ్దాన్‌- ఐ వాంట్‌ టు మీట్‌యూ- ఐ లవ్‌ ఫజ్జా’’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.ఇది వైరల్‌ అయింది.

ఈ విషయాన్ని గల్ఫ్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేయడంతో ఇది కాస్తా హమ్దాన్‌కు తెలిసింది.బాలుడి పరిస్ధితి చూసి చలించిన యువరాజు.అబ్దుల్లా తల్లిదండ్రులను దుబాయ్‌లోని తన ప్యాలెస్‌కు ఆహ్వానించాడు.పిల్లాడితో కొద్దిసేపు గడిపిన క్రౌన్ ప్రిన్స్ అతనితో కలిసి ఫోటోలు దిగి, బహుమతులు అందించాడు.తనకు ఎంతో ఇష్టమైన మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్‌ను కలవడంతో అబ్ధుల్లా హుస్సేన్‌ ఆనందంతో ఉబ్బితబ్బియ్యాడు.

#BoySuffering #SheikhHamdan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dubai Crown Prince Meets Boy 7 Suffering From Cancer Related Telugu News,Photos/Pics,Images..