దుబాయ్ కోర్టు సంచలన తీర్పు...ఆ భారతీయుడికి రూ.6 కోట్లు చెల్లించండి...!!!

నేరం ఎవరు చేసినా శిక్ష పడిన నాడే భాదితుడు ధైర్యంగా ఉండేది, నేరస్తులు మళ్ళీ తప్పలు చేయకుండా భయపడేది.అయితే అలాంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమే.

 Dubai Court's Sensational Verdict Pay Rs 6 Crore To That Indian, Sijish Subrahma-TeluguStop.com

అయితే నేరస్తుడు మారుతాడా లేదా అనే దానికంటే భాదితుడికి న్యాయం జరిగిందా లేదా అనేది ప్రస్తుత పరిస్థితి.వివరాలలోకి వెళ్తే.దుబాయ్ కోర్టు ఓ భారత సంతతి వ్యక్తికి జరిగిన అన్యాయానికి నష్ట పరిహారం చెల్లించండి అంటూ ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీకి రూ.6 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.ఎందుకంటే.

కేరళా రాష్ట్రానికి చెందిన సిజీష్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దుబాయ్ లో ఓ ప్రవైటు కంపెనీలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

ఓ రోజు విధులలో ఉంటూ పని మీద బయటకు వెళ్ళిన క్రమంలో అతడు నడుపుతున్న కారును వెనుకనుంచీ బలంగా ఓ వాహనం వచ్చి డీ కొట్టింది.ఈ సంఘటనలో తీవ్రమైన గాయాలపాలైన సిజీష్ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో సుమారు 2 నెలల పాటు ఉండిపోయారు.

ఫలితం లేక పోవడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం తన సొంత రాష్ట్రం కేరళాకు తీసుకువెళ్ళి అక్కడే చికిత్స చేయించుతున్నారు తరలించారు.ఈ క్రమంలో అతడికి జరిగిన అన్యాయాన్ని.

దుబాయ్ కి చెందిన న్యాయవాది ఫెమిన్ అలాగే మరొక అడ్వకేట్ లు అతడికి నష్ట పరిహారం చెల్లించాలని, సిజీష్ తరపున కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.ఈ కేసును అక్కడి ఇన్స్యూరెన్స్ కంపెనీపై వేయడంతో సదరు కంపెనీ కూడా ప్రతిగా అబుదాబి కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

అయితే కంపెనీ వేసిన కౌంటర్ ను కొట్టేస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కంపెనీ వేసిన పిటిషన్ కొట్టేసింది.అంతేకాదు భాదితుడు సిజీష్ కు రూ.6 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే బాధితుడు ఆసుపత్రికి అయ్యే ఖర్చు సైతం భరించాలని సంచలన తీర్పు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube