భారతీయుడికి జరిగిన అన్యాయం..కళ్ళు చెదిరే పరిహారం ఇప్పించిన దుబాయ్ కోర్ట్..!!!

ఉన్నత న్యాయస్థానాలు ఏ దేశంలో ఉన్నా సరే అవి అత్యున్నతమైన తీర్పునే చెప్తాయి అనడానికి దుబాయ్ లో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి నష్టపరిహారం చెల్లించాలని, అతడికి క్షమాపణలు చెప్పండి అంటూ దుబాయ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Dubai Court, Lathif, Accident Case, Indian, Penality-TeluguStop.com

దాంతో సదరు భారతీయుడికి భారీ నష్టపరిహారం ముట్టింది.ఇంతకీ ఆ భారతీయుడికి దుబాయ్ లో జరిగిన అన్యాయం ఏమిటి.?? కోర్టు అతడికి ఎంత నష్టపరిహారం చెల్లించమని చెప్పింది.ఆ వివరాలలోకి వెళ్తే.

కేరళ రాష్ట్రానికి చెందిన లతీఫ్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు.ఉద్యోగ నిమ్మిత్తం తన వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచీ మరొక వాహనం వచ్చి గుద్దేసీ వెళ్ళిపోయింది.

ఈ ప్రమాదంలో లతీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు.సుమారు రెండు నెలలపాటు దుబాయ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన లతీఫ్ ఇండియా వచ్చాడు.

కేరళలో ఆసుపత్రులలో చికిత్స చేస్తున్నా అతడి కాళ్ళు రావని తేల్చి చెప్పారు వైద్యులు ఇక అతడు వీల్ చైర్ కి పరిమితం కావాలని చెప్పారు.అయితే

ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కేవలం జరిమానా కట్టి బయటకి వచ్చేశాడని తెలిసుకున్న లతీఫ్ మళ్ళీ కోర్టులో డ్రైవర్ ని ఓనర్, మరియు ఇన్సూరెన్స్ సంస్థపై కేసులు వేశాడు.దాంతో కోర్టు ఓ వైద్యుడిని కేరళాలోని లతీఫ్ వద్దకి పంపి వివరాలు తెలుసుకుని లతీఫ్ కి జరిగిన అన్యాయం తీర్చలేనిది కానీ అతడికి భారీ పరిహారం ఇవ్వడం వలన కుటుంభం ఆర్ధికంగా బయటపడుతుంది.కాబట్టి అతడికి 4 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube