కొడుకు ఎదుగుదలే లక్ష్యం: ఉద్యోగం వదులుకుని ఎన్ఆర్ఐ సాహసం

నాన్న..

 Dubai-based Indian Family Turns Son's Innovative School Project Into Business  D-TeluguStop.com

తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.బయటకు కోపంగా కనిపించినా.

మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు.పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని త్యజించే త్యాగమూర్తి.

నాన్నంటే ఓ ధైర్యం.నాన్నంటే బాధ్యత.

ఓ భద్రత, భరోసా.కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు.జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు.వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు.ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు.తన బిడ్డలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు.

పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు.ఈ క్రమంలో ఓ తండ్రి తన కొడుకు ఎదుగుదల కోసం ఏకంగా తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టాడు.

వివరాల్లోకి వెళితే.సుమేశ్ వాద్వా అనే భారతీయుడు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో స్ధిరపడ్డారు.

అతని కుమారుడు ఇషిర్‌ వాద్వా స్థానిక జెమ్స్‌ వరల్డ్‌ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్‌ చదువుతున్నాడు.నలుగురితో పాటు నారాయణ అన్నట్లు కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించిన ఇషిర్ తన మెదడుకు పదునుపెట్టాడు.

గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు.

ఇంజినీరింగ్‌ చదువుతున్న తన సోదరుడు అవిక్‌ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించాడు.

ఈ పద్ధతిలో భాగంగా స్టీల్‌ టేపులను ముందుగా గోడకు అతికిస్తారు.ఆ తర్వాత నియోడిమియమ్‌ అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు.

దీనికి వారు క్లాపిట్‌ అని పేరు పెట్టారు.ప్రయోగంలో భాగంగా తమ ఇంట్లోని హోం థియేటర్‌ సిస్టాన్ని ప్రస్తుతం క్లాపిట్‌కు తగిలించారు.

కొడుకు పట్టుదల, ఆలోచన నచ్చడంతో సుమేశ్ వాద్వా వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు.లక్షల రూపాయల వేతనం అందించే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇషిర్ ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు వ్యాపారం చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube