భారత సంతతి బాలికకు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..!!!.

దుబాయ్ లో భారత సంతతి బాలిక రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలో అద్భుతమైన ప్రతిభ కనబరించినందుకు గాను ఆమె గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఎక్కింది.11 ఏళ్ళ సమృద్ది కాలియా అనే భారత సంతతికి చెందిన బాలిక చిన్న బాక్సులో కేవలం ఒక్క నిమిషంలో దాదాపు 40 యోగాసనాలు వేసి అందరిని ఆశ్చర్యంలో ముచెత్తింది.ఆమె వేసిన యోగాసనాలు సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లో ప్రసారం అయ్యాయి.

 Dubai Based Girl Enters Golden Book Ofrecords, 11 Year Girl, Yoga Asanam,samridh-TeluguStop.com

దాంతోఆమె ప్రతిభని గురించిన గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆ బాలికకి అందులో స్థానం కలిపించారు.ఏడో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి ఇదే ఏడాది జనవరి నెలలో కేవలం ఒక్క నిమిషంలోనే దాదాపు 33 యోగాసనాలు వేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

దాంతో ఆమె ప్రతిభని గుర్తించి ప్రవాసి భారతీయ దివాస్ అనే అవార్డు ని అందించారు.చిన్న వయసులోనే ప్రవాసి దివాస్ అవార్డ్ అందుకున్న అమ్మాయిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది.

గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిన తరువాతా మీడియాతో మాట్లాడిన సమృద్ది రోజుకి రెండు గంటల పాటు యోగాసనాలు చేస్తానని.తనకి యోగా అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.

యోగాసనాలు వేస్తున్న ఎంతో మంది చిన్నపిల్లలని చూసి నేను ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో మొదలు పెట్టానని ఆమె తెలిపింది.అయితే దేశం కాని దేశంలో ఆమె భారతీయులు అందరూ గర్వపడేలా రికార్డ్ సృష్టించడం ఎంతో సంతోషంగా ఉందని తల్లి తండ్రులు, ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube