ప్రవాస భారతీయుడికి దుబాయ్ బ్యాంక్ భంపర్ ఆఫర్..!!

బ్యాంక్ లో 50 వేలు అప్పు చేస్తే ఆ అప్పు వచ్చే వరకూ వడ్డీ లెక్క గట్టి ఖాతాదారుడి ముక్కు పిండి మరీ వసూలు చేస్తాయి.అలాంటిది రూ.2 కోట్లు అప్పు తీసుకుని ఒక్క పైసా కూడా కట్టకుండా ఉంటె సదరు ఖాతాదారుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.కానీ అప్పు తీర్చలేనని , నాకు ఉన్న బాకీని మాఫీ చేయమని రూ.4 లక్షలు మాత్రమే తమకు కట్టగాలనని అభ్యర్ధించిన ఖాతాదారుడి కన్నీటి గాధను విన్న బ్యాంక్ కరిగిపోయింది.తరువాత ఏమయ్యిందంటే.

 Dubai Bank Bumper Offer For Expa Triate Indian-TeluguStop.com

భారత్ కు చెందిన ఓ వ్యక్తి 2008 లో దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు.తన దగ్గర దాచుకున్న సొమ్ముతో ఓ చిన్న కంపెనీను2012 లో స్థాపించాడు.

అయితే వ్యాపారం రాణించలేదు సరికదా బ్యాంక్ లు ఇచ్చిన క్రెడిట్ కార్డ్ సొమ్ము , వాళ్ళు ఇచ్చిన అప్పులు పేరుకు పోయాయి.అప్పు తిరిగి చెల్లించక పోవడంతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

దాంతో భారత్ తిరిగి వచ్చేసిన అతడు.

మళ్ళీ దుబాయ్ వెళ్లి తన సత్తా నిరూపించుకోవాలని అనుకున్నాడు.

అయితే కేసులు ఉండటం, డబ్బు కట్టని కారణంగా ప్రభుత్వం అతడి వీసాను బ్లాక్ లిస్టు లో పెట్టడంతో దుబాయ్ వెళ్ళడానికి అనుమతులు రాలేదు.అప్పట్లో తాను చేసిన అప్పులు ఇప్పటి వరకూ కలిపిన వడ్డీతో చూసుకుంటే మొత్తం రూ.2 కోట్లు అవ్వడంతో తన పరిస్థితిని బ్యాంక్ లకు వివరించి అప్పు మాఫీ అయ్యేలా తనకు మళ్ళీ దుబాయ్ లో వ్యాపారం చేసుకునే అనుమతులు ఇవ్వాలని అక్కడి ఆర్ధిక నిపుణుడు అల్మజార్ ను కోరాడు.దాంతో బ్యాంక్ లకు అతడి ఆర్ధిక పరిస్థితిని వివరించిన అల్మజార్ సాయం చేయాలని కోరాడు.ఖాతాదారుడి పరిస్థితిని గుర్తించిన బ్యాంక్ అతడి అప్పును రద్దు చేయాలని భావించాయి రూ.2 కోట్ల అప్పులో కేవలం రూ.4 లక్షలు కడితే చాలని తెలిపాయి దాంతో దుబాయ్ లో మళ్ళీ వ్యాపారం చేసుకునేందుకు భారతీయుడికి అనుమతులు లభించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube