ఎయిరిండియాకు దుబాయ్ షాక్: 15 రోజుల పాటు నిషేధం  

Dubai Authorities suspends Air India Express flights for 15 days, Coronavirus, Central Governament, Lock Down, Hyderabad, UAE, Air India, - Telugu Air India, Central Governament, Coronavirus, Hyderabad, Lock Down, Uae

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కరోనా వచ్చి మరింతగా ముంచేసింది.ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో విమానయానం పూర్తిగా స్తంభించింది.

TeluguStop.com - Dubai Authorities Suspends Air India Express Flights For 15 Days

ఆ సమయంలో జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఎయిరిండియా బాధలు వర్ణనాతీతం.అయితే కేంద్రం లాక్‌డౌన్ సడలించడంతో అరకొర సర్వీసులు నడుపుతూ నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలో మరోసారి కోవిడ్ ఎయిరిండియాకు షాకిచ్చింది.

TeluguStop.com - ఎయిరిండియాకు దుబాయ్ షాక్: 15 రోజుల పాటు నిషేధం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి పాజిటివ్ రావడంతో దుబాయ్ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు 15 రోజుల పాటు నిషేధిస్తూ దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

గత రెండువారాల్లో ప్రయాణీకుడికి పాజిటివ్ రావడం ఇది రెండోసారని, కోవిడ్ వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంపై ఎయిరిండియాను తప్పుబట్టింది.

కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల విమానంలో అతనితో పాటు ప్రయాణించిన వారందరూ ప్రమాదంలో పడతారని దుబాయ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల వైద్య, క్వారంటైన్ ఖర్చులను భరించాలని జరిమానా సైతం విధించింది.

యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి అతని ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌తో పాటు కరోనా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి.

#Air India #Lock Down #Hyderabad #Coronavirus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dubai Authorities Suspends Air India Express Flights For 15 Days Related Telugu News,Photos/Pics,Images..